బిగ్ బాస్2: కౌశల్ తో సహా అందరూ నామినేషన్ లో.. హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య రచ్చ..

Published : Sep 17, 2018, 11:40 PM ISTUpdated : Sep 19, 2018, 09:28 AM IST
బిగ్ బాస్2: కౌశల్ తో సహా అందరూ నామినేషన్ లో.. హౌస్ మేట్స్ కి కౌశల్ కి మధ్య  రచ్చ..

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 2 వంద ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఆదివారం నామినేషన్స్ లో అమిత్ ఎలిమినేట్ కాగా హౌస్ లో మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు మిగిలి ఉన్నారు. సోమవారం నామినేషన్ ప్రక్రియలో బిగ్ బాస్ మొత్తం హౌస్ మేట్స్ అందరినీ ఎలిమినేషన్ కి నామినేట్ చేయడం ఆశ్చర్యానికి గురి చేసింది.

ముందుగా కౌశల్ పేపర్స్ మీద ఏదో రాస్తున్నారని ఇంటి రూల్స్ ని పాటించడం లేదని చెప్పిన బిగ్ బాస్ మిగిలిన హౌస్ మేట్స్ కూడా ఏదొక సంధర్భంగా రూల్స్ అతిక్రమిస్తున్నారని దీంతో ఈ వారం మొత్తం అందరినీ నామినేట్ చేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. దీంతో హౌస్ మేట్స్ అందరూ ఒక్కటై కౌశల్ పై విరుచుకుపడ్డారు. ఇలా జరగడానికి ఒక కారణమైతే మీరే అంటూ అతడిని నిందించారు. 

రోల్, తనీష్, సామ్రాట్, దీప్తి, గీతా అందరూ కౌశల్ ని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు. బిగ్ బాస్ రూల్స్ మీరు ఫాలో కాకపోతే కరెక్ట్ అని అదే మేము అతిక్రమిస్తే తప్పని కౌశల్ పై వ్యంగ్యంగా విమర్శలు చేశారు. కౌశల్ కూడా కొన్ని పరిస్థితుల్లో నోరు జారడంతో ఆ విషయాలను హైలైట్ చేస్తూ హౌస్ మేట్స్ మరింత రెచ్చిపోయారు. అందరూ ఎపిసోడ్ లో అరుస్తూనే ఉన్నారు. 

కౌశల్ పాత విషయాలను కూడా తవ్వి తీయడం మరిన్ని వివాదాలకు దారి తీసింది. మొత్తానికి హౌస్ మేట్స్ అందరూ నామినేట్ అయ్యామనే ఫ్రస్ట్రేషన్ తో బిగ్ బాస్ హౌస్ ని కాస్త రచ్చబండ చేసేశారు. 

PREV
click me!

Recommended Stories

Rithu Chowdary Eliminate: చివరి నిమిషంలో బిగ్‌ బాస్‌ షాకింగ్‌ ట్విస్ట్, రీతూ ఎలిమినేట్‌.. కారణం ఇదే
2025 Box office దగ్గర సునామీ సృష్టించిన చిన్న సినిమాలు, తక్కువ బడ్జెట్ ఎక్కువ కలెక్షన్స్