బిగ్ బాస్2: అమిత్ ఔట్.. వెళ్లిపోతూ కౌశల్ పై కామెంట్స్!

By Udayavani DhuliFirst Published Sep 16, 2018, 10:47 PM IST
Highlights

బిగ్ బాస్ సీజన్2 ఈ వారం నామినేషన్స్ లో ఐదుగురు హౌస్ మేట్స్ ఉండగా.. ఆదివారం ఎపిసోడ్ లో ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే విషయాన్ని నాని చెప్పేశారు. ముందుగా కౌశల్, దీప్తి, గీతామాధురి సేవ్ అయినట్లు ప్రకటించిన నాని.. రోల్ రైడా, అమిత్ లలో అమిత్ ఎలిమినేట్ అయినట్లు వెల్లడించారు. 

స్టేజ్ మీదకు వచ్చిన అమిత్ ని హోస్ట్ నాని హౌస్ లో ఉన్న ఒక్కో కంటెస్టెంట్ పై తన ఒపీనియన్ చెప్పమని అడగగా.. రోల్ జెన్యూన్ అండ్ రియల్ అని..  దీప్తి బాగా బయపడుతుందని.. సేఫ్ ప్లే ఆడుతుందని అన్నారు. తనీష్ కి నేనే అనే ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ చాలా జెన్యూన్ అన్నాడు. కౌశల్ కన్నింగ్ అనొచ్చు.. స్మార్ట్ అనొచ్చు.. ఒక్కో వీక్ ఒక్కోలా ఉంటారు.. తనేలా ఆడుతున్నారో అందరూ అలానే ఆడాలని అనుకుంటారు.

సామ్రాట్ బెస్ట్ ఫ్రెండ్.. చాలా మంచి వ్యక్తని.. గీతామాధురి ఓపెన్ గా మాట్లాడుతుందని.. మంచి సెన్సాఫ్ హ్యూమర్ ఉందని అన్నారు. ఇక బిగ్ బాస్ టాప్ త్రీలో ఎవరు ఉంటారని అనుకుంటున్నావని నాని ప్రశ్నించగా.. రోల్ రైడా, సామ్రాట్, గీతామాధురిల పేర్లు చెప్పారు. ఇక వెళ్లిపోతూ వెళ్లిపోతూ బిగ్ బాంబ్ ని దీప్తిపై విసిరారు.

దీనిప్రకారం ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ ఎవరు తమ జుట్టుని దువ్వుకోవాలన్నా అది దీప్తినే చేయాలి. హౌస్ మేట్స్ ఎవరూ కూడా దువ్వెన ముట్టుకోకూడదు.. ఒకవేల బిగ్ బాంబ్ రూల్స్ ని సరిగ్గా పాటించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని నాని అన్నారు. 
 
click me!