మహేష్ వివాదాన్ని లైట్ తీసుకోండి.. నడిఘర్ సంఘం సలహా!

Published : Sep 16, 2018, 03:22 PM ISTUpdated : Sep 19, 2018, 09:27 AM IST
మహేష్ వివాదాన్ని లైట్ తీసుకోండి.. నడిఘర్ సంఘం సలహా!

సారాంశం

తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్.. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై స్టేజ్ మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేయడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు.

తమిళ స్టాండప్ కమెడియన్ మనోజ్ ప్రభాకర్.. టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుపై స్టేజ్ మీద చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో  మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో అతడిని టార్గెట్ చేయడంతో క్షమాపణలు చెబుతూ ఓ పోస్ట్ పెట్టాడు. అయినప్పటికీ మహేష్ ఫ్యాన్స్ మాత్రం అతడిని విడిచిపెట్టలేదు. 

ఈ విషయంపై మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా స్పందించి తమ హీరోని అవమానించినందుకు మనోజ్ పై చర్యలు తీసుకోవాలని నరేశ్-శివాజీరాజాలు నడిఘర్ సంఘానికి లేఖ రాశారు. అయితే ఈ వివాదాన్ని లైట్ తీసుకోమని నడిఘర్ సంఘం సభ్యులు చెప్పినట్లు సమాచారం. 

మహేష్ బాబు గురించి అందరికీ తెలుసని అతడి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని అలాంటిది అతడి గురించి ముక్కూ మొహం తెలియని వాళ్లు కామెంట్ చేస్తే స్పందించాలని అవసరం లేదని చెప్పినట్లు సమాచారం.

నిజానికి మనోజ్ రెగ్యులర్ సినిమా ఆర్టిస్ట్ కాదు.. స్టేజ్ షోలకి మాత్రమే పరిమితమయిన అతడిపై నడిఘర్ సంఘం చర్యలు తీసుకోవడం కుదరదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా.. అనవసరమైన పబ్లిసిటీ ఇచ్చినట్లవుతుందని, ఇక్కడితో ఈ విషయాన్ని వదిలేస్తే మంచిదని సూచించినట్లు తెలుస్తోంది. 

PREV
click me!

Recommended Stories

Amla Paul: కొడుకుతో క్యూట్ ఫోటోలని షేర్ చేసిన అమలాపాల్.. నెటిజన్ల విమర్శలు
అప్పటిదాకా అబ్బాయిల ఊసే లేదు..! హీరోయిన్ శ్రీలీల అంత మాట అనేసిందేంటి..