`గుంటూరుకారం` సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు. ఇక ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లని విడుదల చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ డేట్‌ని ప్రకటించింది యూనిట్.
సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన `గుంటూరు కారం` మూవీ విడుదలకు సిద్ధమవుతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రూపొందించిన ఈ చిత్రం సంక్రాంతికి ఆడియెన్స్ ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. ఇప్పటికే ఇటీవల విడుదలైన `కుర్చీ మడత బెట్టి.. ` సాంగ్ దుమ్మురేపుతుంది. ఓ వైపు ట్రోల్స్, మరోవైపు ప్రశంసలతో రచ్చ చేస్తుంది. యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. ఈ పాటతో కుర్చీ తాత పాపులర్ అయ్యాడు.
ప్రమోషన్స్ లో మరింత స్పీడ్ పెంచారు. ఇక ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్లని విడుదల చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ డేట్‌ని ప్రకటించింది యూనిట్. జనవరి 6న విడుదల చేయబోతున్నట్టు తెలిపింది. అదే రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేశారు. ఈ ఈవెంట్లో `గుంటూరు కారం` చిత్ర ట్రైలర్‌ని విడుదల చేయబోతున్నారు. ఈ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని నిర్వహించబోతున్నారట. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటే `గుంటూరు కారం` సినిమా సరికొత్త ట్రెండ్ సృష్టించబోతుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని అమెరికాలో లైవ్ పెట్టబోతున్నారట. లైవ్ స్క్రీనింగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన టీజర్, గ్లింప్స్, పాటలకు మంచి పేర్కొచ్చింది. రెండో పాట డిజప్పాయింట్ చేసినా మూడో పాట దుమ్ములేపింది. దీంతో ఇప్పుడు ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. చాలా వరకు సంక్రాంతి సినిమాల ట్రైలర్లు ఐదు లోపు వచ్చేస్తున్నారు. ఆరున `గుంటూరు కారం`ని దించబోతున్నారు. ఆడియెన్స్ లో క్యూరియాసిటీని క్యారీ చేయబోతున్నారు.
ఇక `అతడు`, `ఖలేజా` వంటి చిత్రాల తర్వాత మహేష్‌బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా `గుంటూరు కారం`. ఇందులో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. మీనాక్షి చౌదరి మరో హీరోయిన్గా కనిపించబోతుంది. త్రివిక్రమ్ తన క్లాస్ టచ్ నుంచి రూట్ మార్చి మాస్ స్టయిల్లో ఈ మూవీని తెరకెక్కించాడు. ఇందులో గుంటూరు లోకల్ గ్యాంగ్ కి లీడర్‌గా మహేష్‌బాబు కనిపిస్తాడని తెలుస్తుంది. వెంకట రమణరెడ్డి ఆయన పాత్ర పేరు అని టాక్. సినిమాపై భారీ అంచనాలున్నాయి. మరి వాటిని ఏమేరకు రీచ్ అవుతుందో చూడాలి.
ప్రస్తుతం మహేష్‌బాబు దుబాయి వెకేషన్లో ఉన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఆయన ఫ్యామిలీతో కలిసి దుబాయ్ వెళ్లారు. అక్కడే ఓ యాడ్ షూట్లోనూ పాల్గొన్నారు. త్వరలోనే ఆయన ఇండియాకి తిరిగి రానున్నారు. ఆ తర్వాత వరుసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నట్టు సమాచారం.