
మాస్ ఇమేజ్ లో ఎన్టీఆర్ కున్న లెవెల్ రానాకు లేదు. ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో ఎన్టీఆర్ కన్నా రానా కాస్త తక్కువేనని చెప్పాలి. ఇటు ఎన్టీఆర్, అటు రానా.. ఇద్దరూ తమదైన శైలిలో సినిమాలు తీస్తూ.. ప్రజలను ఆకట్టుకుంటున్నారు. బాహుబలి లాంటి సినిమాలో నటించిన రానా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినా.. ఓపెనింగ్స్ లో ఎన్టీఆర్ రేంజిలో వసూళ్లు రాబట్టలేడు.
అయితే.. బుల్లి తెర మీద మాత్రం.. ఎన్టీఆర్ పై రానా పై చేయి సాధిస్తున్నాడనే వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. విషయానికి వస్తే.. తారక్.. స్టార్ మా ఛానెల్ లో వస్తున్న ‘బిగ్ బాస్’ షో కి హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. రానా.. జెమిని టీవీలో ‘ నెం.1 యారి’ ప్రోగ్రామ్ యాంకరింగ్ చేస్తున్నాడు. ఇంచుమించుగా ఈ రెండు షోలు ఒకేసారి ప్రారంభం అయ్యాయి.
ఈ రెండు షోల టీఆర్.పి రేటింగ్ ల విషయంలో రానా షో.. బిగ్ బాస్ ని దాటేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల రానా షోకి మంచు లక్ష్మీ, తాప్సీ రాగా.. ఆ రోజు టీ ఆర్ పీ రికార్డు స్థాయిలో 10.3 వచ్చింది.. అదే రోజు బిగ్ బాస్ కి మాత్రం 6.23 మాత్రమే వచ్చింది. దీంతో రానా షోకి ఉన్న క్రేజ్ .. బిగ్ బాస్ కి లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రానా షో వారంలో కేవలం ఒకేరోజు ఉండటం గమనించాల్సిన విషయం.
అంతేకాకుండా.. నెం.1 యారి కి పెద్ద సెలబ్రిటీలు రావడం.. ఎపిసోడ్ కి ఒక కొత్త దనం ఉండటంతో .. ఇవన్నీ రానాకి కలిసొస్తున్నాయి అంటున్నారు. అయితే.. ఇవన్నీ వట్టి అబద్దాలేనని.. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో నే ఎక్కువ మంది చూస్తున్నారని తారక్ అభిమానులు చెబుతున్నారు.