నాగార్జునను అరెస్ట్ చేయాలని డిమాండ్, మన్మధుడి మెడకు చుట్టుకున్న బిగ్ బాస్ వివాదం

By Mahesh JujjuriFirst Published Dec 20, 2023, 12:28 PM IST
Highlights

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 వివాదం అటు తిరిగి ఇటు తిరిగి కింగ్ నాగార్జున మెడకు చుట్టుకునేలా ఉంది. ప్రస్తుతం జరుగుతున్న రచ్చకు కింగ్ కారణమంటూ.. ఆయనపై మండిపడుతున్నారు సోషల్ యాక్టీవిస్ట్ లు. 
 

ఈ సారి బిగ్‌బాస్‌ సీజన్‌ 7 మరింత రచ్చకు దారి తీసింది. తాజాగా  ముగిసిన ఈ రియాల్టీ షో... అందరిని ఉలిక్కి పడేలా చేసింది. రీసెంట్ గా జరిగిన  గ్రాండ్‌ ఫినాలే నాడు జరిగిన గోడవలు.. కేసుల వరకూ వెళ్ళాయి. హౌస్ లో ఉండగానే పల్లవి ప్రశాంత్,అమర్ దీప్ చౌదరి మధ్య జరిగిన టంగ్ వార్.. ఫిజిలక్ వార్ గా మారింది. విన్నర్ గా పల్లవి ప్రశాంత్ కప్పు గెలవడం.. బయటకు వ్చిన తరువాత  ప్రశాంత్ తో పాటు అతని అనుచరులు చేసిన రచ్చపై జూబ్లీహిల్స్ కేసులు నమోదు చేశారు. కేసులు నమోదుకావడంతో  పల్లవి ప్రశాంత్‌ పరారీలో ఉన్నాడు. పోలీసులు ప్రత్యేక బృందాలుగా అతని కోసం వెతకడం స్టార్ట్ చేశారు. 

 ఫినాలే రోజు పల్లవి ప్రశాత్  ప్యాన్స్.. అమర్ దీప్ ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలు.. ప్రశాంత్ కాంట్రవర్సీ కామెంట్స్. సెలెబ్రిటీల కారు అద్దాలు ధ్వంసం చేయడం.. ఆర్టీసీ బస్సు అద్దాలు ధ్వంసం చేయడంతో ఈ విషయం సీరియస్ అయ్యింది. దాంతో పోలీసులు చర్యలు చేపట్టారు. అటు ఆర్టీసీ ఎమ్ డి సజ్జనార్ కూడా ఈ విషయంలో గట్టిగా వార్నింగ్ ఇచ్చరు. ఇక చిలికి చిలికి గాలివానగా మారిన ఈ విషయం నాగార్జున మెడకు చుట్టుకునేలా ఉంది. బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న హీరో నాగార్జునను అరెస్ట చేయాలని పలువురు  హైకోర్టులో పిటిషన్‌ కూడా  దాఖలు చేశారు.  బిగ్‌బాస్‌ పేరుతో 100 రోజులు అక్రమంగా కొందరిని నిర్బంధిస్తున్నారని.. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకొని నాగార్జునను అరెస్ట్ చేయాలంటూ అడ్వొకేట్ అరుణ్‌ పిటిషన్‌ వేశారు. 

పల్లవి ప్రశాంత్ ఆవేదన, నన్ను బ్యాడ్ చేయాలని చూస్తున్నారంటూ వీడియో

అంతే కాదు.. బిగ్‌బాస్‌లో పాల్గొన్నవారిని కూడా విచారించాలని పిటిషన్‌లో కోరారు. ఆర్టీసీ బస్సు అద్దాలు చేయడం వెనుక ఉన్న కుట్రను బయటపెట్టేలా విచారణకు ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఇక బిగ్ బాస్ విషయంలో పలువురు కొన్నాళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. నాగార్జున ఇంటిముందు కూడా గత సీజన్లలో ఆందోళణలు చేశారు. సీపీఐ జాతీయ నేత నారాయణ కూడా బిగ్ బాస్ విషయంలో పలు సదర్భంల్లో హాట్ కామెంట్స్ చేశారు. నాగార్జునను విమర్షించారు. తాజాగా కూడా నారాయణ బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలని డియాండ్ చేశారు. ఇక ఈ విషయంలో నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. 

అటు పల్లవి ప్రశాంత్ కూడా తనను నెగెటీవ్ చేయాలని చూస్తున్నారంటూ  ఓ వీడియోను రిలీజ్ చేశాడు. తన తప్పు లేకుండా తనను బ్యాడ్ చేసే కుట్ర జరుగుతందని. ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ విన్నర్ అవ్వకూడదా..? నేను ఎదగడం ఇష్టం లేదా అంటూ.. ఓ సెంటిమెంట్ వీడియోను తన స్టైలో రిలీజ్ చేశారు. కాని ప్రస్తుతం జరిగిన గొడవలు, తన ఫ్యాన్స్ చేసిన అల్లర్లకు సబంధించిన వివరణ ఇచ్చే ప్రయత్నం చేయలేదు ప్రశాంత్. 

Pallavi Prashanth: పరారీలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్... పోలీసుల గాలింపు!

click me!