
ఈ ఏడాది ఎంతో మంది తారలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. టాలీవుడ్ నుంచి ఎక్కువమంది ఫేమస్ నటులను ఇండస్ట్రీ కోల్పోయింది. అటు హాలీవుడ్ లో కూడా వరుస మరణాలు కలవరపెడుతున్నాయి. కొత్త సంవల్సరం కొన్ని రోజుల్లో ఉంది అనగా.. హాలీవుడ్ గొప్ప నటుడిని కోల్పోయింది. ప్రముఖ హాలీవుడ్ నటుడు జేమ్స్ మెక్‌కాఫ్రీ (65) కన్నుమూశారు. చాలా కాలాంగా జేమ్స్ క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. మెక్‌కాఫ్రీ మృతి చెందినట్లుగా ఆయన ఫ్యామిలీ నుంచి ప్రకట వెలువడింది. న్యూయార్క్ శివారులోని లార్చ్‌మాంట్‌లోని ఇంట్లో మల్టిపుల్ మైలోమాతో మరణించినట్లు మెక్‌కాఫ్రీ భార్య, నటి రోచెల్ బోస్ట్రోమ్ వెల్లడించారు.
అయితే అతను బాధపడేది ఒక రకమైన క్యాన్సర్ వ్యాధితో. మైలోమా వ్యాధి రక్తంపై ప్రభావం చూపిస్తుంది. ముక్యంగా తెల్ల రక్త కణాలను ప్రభావితం చేసే ఒక రకమైన క్యాన్సర్ ను మైలోమా అంటారు. ఈ వ్యాధితో జేమ్స్ మెక్ క్రాఫీ మరణించడం జరిగింది. హాలీవుడ్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా అతను ప్రభావం ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా జేమ్స్.. మోస్ట్ ఫేమస్ వీడియో గేమ్ సిరీస్‌లో మాక్స్ పేన్’కి వాయిస్ ఆర్టిస్ట్‌గా పని చేసిన ఆడియన్స్‌కు దగ్గరయ్యారు. రెస్క్యూ మి లాంటి చాలా టెలివిజన్ షోలలో నటించి మెప్పించారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు జేమ్స్ మెక్ క్రాఫీ.
హాలీవుడ్ నటుడి అకాల మరణంతో ఇండస్ట్రీలో విషాద చాయాలు అలముకున్నాయి. పలువురు నటీనటులు సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. జేమ్స్ ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఎన్‌టూరేజ్ స్టార్ కెవిన్ డిల్లాన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. జేమ్స్ మెక్‌కాఫ్రీ వీడియో గేమ్ సిరీస్‌కి వాయిస్ ఆర్టిస్ట్‌గా పని చేయక ముందు 35సంవత్సరాలకుపైగా సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో పని చేశారు. 1980 సంవత్సరం నుంచి నటిస్తున్న జేమ్స్ ‘న్యూయార్క్ అండర్ కవర్’ ప్రాజెక్ట్‌తో గుర్తింపు పొందాడు.