Bigg Boss Telugu 7: తండ్రి మరణంతో బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్న నటి!

Published : Sep 01, 2023, 03:46 PM IST
Bigg Boss Telugu 7: తండ్రి మరణంతో బిగ్ బాస్ ఛాన్స్ వదులుకున్న నటి!

సారాంశం

బిగ్ బాస్ హౌస్ కి వెళ్లేందుకు సిద్ధమవుతున్న పూజా మూర్తి ఇంట్లో విషాదం నెలకొంది . దీంతో ఆమె ఆఫర్ వదులుకున్నారని తెలుస్తుంది.   

మరికొన్ని గంటల్లో బిగ్ బాస్ తెలుగు 7(Bigg Boss Telugu 7) ప్రారంభం కానుంది. లాంచింగ్ ఈవెంట్ ప్రిపరేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పలువురి సెలెబ్రిటీల పేర్లు తెరపైకి వచ్చాయి. నటుడు శివాజీ, ఫర్జానా బిగ్ బాస్ లేటెస్ట్ సీజన్ కి ఎంపికయ్యారనే వాదన ఉంది. సీరియల్ నటి పూజా మూర్తి సైతం షోకి ఎంపికయ్యారట. పూజ మూర్తి కొన్ని సీరియల్స్ లో లీడ్ రోల్ చేసింది. ఆమెకు బుల్లితెర ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది. 

సీజన్ 7కి ఆమె ఎంపిక కాగా హౌస్లో అడుగుపెట్టేందుకు సిద్ధంగా ఉంది. అనుకోకుండా పూజా మూర్తి తండ్రి అకాల మరణం పొందారు. తండ్రి మరణంతో పూజా మూర్తి (Pooja Murthy)కుమిలిపోతున్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా తన వేదన తెలియజేశారు. వీలైతే తిరిగి వచ్చేయండి. నేనేమైనా తప్పులు చేసి ఉంటే క్షమించండి. మీరు ఎప్పుడూ మాతోనే ఉంటారని తెలుసు. అమ్మకు, నాకు మీ ఆశీస్సులు కావాలి, అని ఆమె ఇంస్టాగ్రామ్ స్టేటస్ పోస్ట్ చేశారు. 

పూజా మూర్తి పోస్ట్ వైరల్ అవుతుంది. ఇక తండ్రి మరణంతో బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదట. నిర్వాహకులకు ఈ మేరకు ఆమె సమాచారం ఇచ్చారట. దీంతో మేకర్స్ ఆమె స్థానంలో మరొకరిని పంపే ఆలోచనలో ఉన్నారట. లేదంటే వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఆమెను కొద్దిరోజుల తర్వాత హౌస్లోకి పంపే అవకాశం ఉంటుంది. 

ఇక సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు ప్రసారం కానుంది. నాగార్జున హోస్ట్ గా సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. ఊహాగానాలకు తెరదించుతూ ఆ రోజు ఒక్కో కంటెస్టెంట్ ని నాగార్జున స్వయంగా పరిచయం చేస్తారు. హౌస్లోకి పంపిస్తారు. ఈసారి రెండు హౌస్లు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. 20 మంది కంటెస్టెంట్స్ పాల్గొనబోతుండగా ఈసారి రెండు వేర్వేరు హౌస్లు ఉంటాయట. ఒకే షోలో రెండు ఇళ్లు అన్నమాట. కంటెస్టెంట్స్ ని విభజించి రెండు ఇళ్లలోకి పంపుతారట. కంటెస్టెంట్స్ గేమ్స్, టాస్క్స్, పరిస్థితులు, ప్రవర్తన ఆధారంగా ఇళ్ళు మారుతూ ఉంటారట. ఈ కాన్సెప్ట్ ఏదో బాగుందనిపిస్తుంది. ప్రేక్షకులకు కనెక్ట్ అయితే భారీ ఆదరణ దక్కడం ఖాయం. 


 

PREV
click me!

Recommended Stories

Bigg Boss 9 Finale Voting : కళ్యాణ్ పడాల , తనూజ మధ్య అసలు పోటీ.., ఫినాలే ఓటింగ్ లో ఎవరు ముందున్నారంటే?
Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ