నామినేషన్‌లో బూతులతో రెచ్చిపోయిన ఇనయ, కీర్తి.. చంటికి బిగ్‌ బాస్‌ వార్నింగ్‌.. నాల్గో వారం నామినేటైంది వీళ్లే

Published : Sep 27, 2022, 12:20 AM ISTUpdated : Sep 27, 2022, 12:22 AM IST
నామినేషన్‌లో బూతులతో రెచ్చిపోయిన ఇనయ, కీర్తి.. చంటికి బిగ్‌ బాస్‌ వార్నింగ్‌.. నాల్గో వారం నామినేటైంది వీళ్లే

సారాంశం

నామినేసన్ల ప్రక్రియలో భాగంగా హౌజ్‌మేట్ల మధ్య హాట్‌ చర్చ జరిగింది. ముఖ్యంగా ఇనయ, శ్రీహాన్ ల మధ్య చర్చ హాట్‌గా, ఫన్నీగా సాగడం విశేషం. ఇయనని శ్రీహాన్ నామినేట్ చేసిన సందర్భంలో అతనిపై ఇనయ గట్టిగానే రియాక్ట్ అయ్యింది.

బిగ్‌ బాస్‌ తెలుగు 6 సీజన్‌ నాల్గో వారం ప్రారంభమైంది. ఆదివారం ఎపిసోడ్‌లో నేహా ఎలిమినేట్‌ అయిన విషయం తెలిసిందే. ఇక సోమవారం ఎపిసోడ్‌లో పూర్తిగా నామినేషన్ల ప్రక్రియ సాగింది. దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ఈ నామినేషన్ల ప్రక్రియ సాగింది. నామినేట్‌ చేయడానికి సరైన కారణాలు లేక హౌజ్‌మేట్స్ చాలా సిల్లీ సీజన్స్ తో ఇతర సభ్యులను నామినేట్‌ చేయాల్సిన పరిస్థితి అసాంతం నామినేషన్ల ప్రక్రియలో కనిపించింది. 

ఇందులో రాజశేఖర్‌, ఇనయాలను శ్రీహాన్ నామినేట్‌ చేశారు. ఇనయ, రేవంత్ లను సుదీప.. చంటి, ఇనయలను గీతూ.. రేవంత్‌, సూర్యలను వసంతి.. ఇనయ, రేవంత్‌లను ఆరోహి, శ్రీ సత్య.. సూర్య, రేవంత్ లను బాలాదిత్య.. సుదీప, శ్రీహాన్‌ లను ఇనయ.. గీతూ, ఇనయాలను చంటి.. రాజ్‌, గీతూలను అర్జున్.. వసంతి, ఇనయలను సూర్య.. శ్రీసత్య, ఆరోహిలను రేవంత్.. శ్రీహాన్‌, ఆరోహిలను రాజ్‌.. సూర్య, ఇనయలను రోహిత్‌-మరీనా.. ఇనయ, రేవంత్లను కీర్తి నామినేట్‌ చేశారు. అత్యధికంగా ఇనయకి 8 నామినేషన్లు వచ్చాయి. 

ఇక ఈ ప్రక్రియలో భాగంగా హౌజ్‌మేట్ల మధ్య హాట్‌ చర్చ జరిగింది. ముఖ్యంగా ఇనయ, శ్రీహాన్ ల మధ్య చర్చ హాట్‌గా, ఫన్నీగా సాగడం విశేషం. ఇయనని శ్రీహాన్ నామినేట్ చేసిన సందర్భంలో అతనిపై ఇనయ గట్టిగానే రియాక్ట్ అయ్యింది. తన టైమ్‌లోనూ గట్టిగానే వాదించింది. గేమ్‌లో నీ అంత ఏజ్‌ కాదు నాది అంటూ శ్రీహాన్‌ వ్యాఖ్యానించడాన్ని ఇనయ తప్పుపట్టింది. ఈ క్రమంలో బాడీ షేమింగ్‌ వాదన వరకు వెళ్లింది. ఈ డిస్కషన్‌ సమయంలో శ్రీహాన్‌ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ఆశ్చర్యకరంగా, ఫన్నీగా ఉండటం విశేషం. 

మరోవైపు కీర్తి, ఇనయల మధ్య నామినేషన్ల సమయంలోనూ ఇలాంటి చర్చే జరిగింది. కెప్టెన్సీ టాస్క్ సమయంలో ఇనయ ప్రవర్తనని తప్పుపడుతూ కీర్తి వాదించింది. దీనికి ఇనయ కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఇందులో ఇనయ చేసిన పని కీర్తి ఏకంగా చేసి చూపించడం విశేషం. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం పీక్‌కి వెళ్లింది. అలాగే రేవంత్‌, కీర్తిల మధ్య చర్చ కూడా అదే స్థాయిలో హాట్‌ హాట్‌ చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇనయ పలు బూతు పదాలు వాడగా, కీర్తి కూడా అంతే పనిచేసింది. ఒక్కసారిగా హీటు పెంచేశారు. 

ఓ వైపు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంటే చంటి, శ్రీసత్య గుసగుసలాడుకోవడం, చంటి ఓ బూత్‌  ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం హాట్ టాపిక్‌ అవుతుంది. మొత్తంగా నాల్గో వారం నామినేషన్ల ప్రక్రియలో ఇద్దరు అర్జున్‌, కీర్తి నేరుగా నామినేట్‌ కాగా, ఇనయ, రేవంత్‌, సుదీప, శ్రీహాన్‌, అర్జున్‌, గీతూ, సూర్య, రాజ్‌, ఆరోహిలు నామినేట్‌ వెళ్లారు. నాల్గో వారంలో హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యేందుకు నామినేట్‌ అయ్యారు. నాగార్జున హోస్ట్ గా చేస్తున్న `బిగ్‌ బాస్‌ 6 తెలుగు` షో ఈ సారి చాలా చప్పగా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. దీంతో షోని నిలిపివేయాలనే ఆలోచనలో స్టార్‌ మా భావిస్తున్నట్టు సమాచారం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే