#Karthikeya2 ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌.. చిరంజీవి, నాగ్ లకు పోటీగా బరిలోకి నిఖిల్‌..

Published : Sep 26, 2022, 09:01 PM IST
#Karthikeya2 ఓటీటీ రిలీజ్‌ డేట్ ఫిక్స్‌.. చిరంజీవి, నాగ్ లకు పోటీగా బరిలోకి నిఖిల్‌..

సారాంశం

యంగ్‌ హీరో నిఖిల్‌ సిద్ధార్థ్‌ నటించిన సంచలన చిత్రం `కార్తికేయ 2`. ఈ సినిమా థియేటర్లలో బాక్సాఫీసుని షేక్‌ చేసిన విషయంతెలిసిందే. ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి రాబోతుంది.

యంగ్‌ హీరో నిఖిల్ హీరోగా నటించిన సంచలన చిత్రం `కార్తికేయ 2`. అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. గత నెలలో విడుదలైన ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకుంది. పాన్‌ ఇండియా తరహాలో రిలీజ్‌ అయిన ఈ సినిమా ఏకంగా 130కోట్లు వసూలు చేసింది. చిత్ర యూనిట్‌నే కాదు, ట్రేడ్‌ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. నార్త్ లో కలెక్షన్ల దుమ్ము దులిపింది. 

నిఖిల్‌ కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఆయన్ని ఓ రకంగా పాన్‌ ఇండియా హీరోని చేసేసింది. ఓవర్‌ నైట్‌లో నిఖిల్‌ పాన్‌ ఇండియా హీరోల జాబితాలో చేర్చింది. ఈ ఏడాది హిట్స్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు తక్కువ బడ్జెట్‌తో రూపొంది ఇంతటి కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు క్రియేట్‌ చేసింది. సినిమా విడుదలై నెలన్నర కావోస్తుంది. ఇప్పటికీ దీనిపై చర్చనడుస్తుంది. 

ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్ అయ్యింది. ఈ సినిమా జీ5ఓటీటీలో ప్రసారం కాబోతున్న విషయం తెలిసిందే. ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ కన్ఫమ్‌ అయ్యింది. దసరా కానుకగా అక్టోబర్‌ 5నే ఈ సినిమా కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కాబోతుండటం విశేషం. అదే రోజు థియేటర్లో చిరంజీవి `గాడ్‌ ఫాదర్‌`, నాగార్జున `ది ఘోస్ట్` చిత్రాలతోపాటు యంగ్‌ హీరో బెల్లంకొండ గణేష్‌ నటిస్తున్న `స్వాతిముత్యం` చిత్రాలు థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇంతటి భారీ పోటీ నడుమ `కార్తికేయ 2`ని ఓటీటీలో విడుదల చేయబోతుండటం విశేషంగా చెప్పొచ్చు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Avatar 3 Review: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' ఫస్ట్ రివ్యూ.. జేమ్స్ కామెరూన్ ఇలా చేశారు ఏంటి, ఇది పెద్ద చీటింగ్
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే