రాజమౌళికి పోటీగా రూ . 500 కోట్ల భారీ ప్రాజెక్ట్ తో వస్తున్న వివి వినాయక్! 

By Sambi ReddyFirst Published Sep 26, 2022, 5:07 PM IST
Highlights

వి వి వినాయక్ దర్శకుడిగా భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనుందట. ఓ బాలీవుడ్ సంస్థ ఏకంగా రూ. 500 కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధమైందని సమాచారం అందుతుంది. ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ వెల్లడించారు.

ఒకప్పుడు దర్శకుడు రాజమౌళితో పోటీపడ్డారు వివి వినాయక్. బాహుబలి సిరీస్ తో రాజమౌళి అందనంత ఎత్తుకు ఎదిగితే... వినాయక్ మాత్రం ప్లాప్స్ తో క్రిందికి జారిపడ్డారు. స్టార్ డైరెక్టర్ గా ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన వివి వినాయక్ చాలా కాలం ఖాళీగా ఉన్నారు. ఒక దశలో ఏం చేయాలో తెలియక హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. సీనయ్య టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దిల్ రాజు నిర్మాతగా ఉన్న ఈ ప్రాజెక్ట్ ప్రకటనతోనే ఆగిపోయింది. 

కాగా వివి వినాయక్ ప్రస్తుతం హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో ఛత్రపతి హిందీ రీమేక్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న పెన్ స్టూడియోస్ వివి వినాయక్ కి భారీ ఆఫర్ ప్రకటించిందట. రూ. 500 కోట్ల బడ్జెట్ తో మూవీ చేసేందుకు సై అందట. ఛత్రపతి రీమేక్ అవుట్ ఫుట్ పట్ల సంతృప్తికరంగా ఉన్న పెన్ స్టూడియోస్ ఆయనతో భారీ పాన్ ఇండియా మూవీ చేద్దామని డీల్ కుదుర్చుకుందట. కథా చర్చలు కూడా ముగియగా.. ఛత్రపతి ముగియగానే ఈ ప్రాజెక్ట్ పనులు మొదలుకానున్నాయట. ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ వివరించారు. 

పరిశ్రమ నుండి కనుమరుగు అవుతున్న తరుణంలో ఇలాంటి ఆఫర్ రావడమంటే మామూలు విషయం కాదు. వివి వినాయక్ ఈ అవకాశం ఉపయోగించుకుంటే రాజమౌళికి మరలా పోటీ ఇవ్వడం, స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో జాయిన్ కావడం ఖాయం. అయితే ఛత్రపతి రిజల్ట్ పైనే ఈ ప్రాజెక్టు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఛత్రపతి విజయం సాధిస్తే మేకర్స్ విశ్వాసంతో ముందుకు వెళతారు లేదంటే... కష్టమే. కాబట్టి బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి పైనే వివి వినాయక్ ఆశలన్నీ. 

తెలుగు వర్షన్ కి మించి యాక్షన్ డోస్ అధికంగా ఛత్రపతి హిందీ లో ఉంటుందట. హీరోయిన్స్ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో మేకింగ్ ఆలస్యమైందట. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కాగా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయట. ఇక విఎఫ్ఎక్స్ కి కూడా బాగానే ఖర్చు చేస్తున్నారట. మొత్తంగా వివి వినాయక్ కి పెన్ స్టూడియోస్ రూపంలో మంచి అవకాశం దక్కింది. ఆ అవకాశాన్ని ఆయన ఎంత వరకు ఉపయోగించుకుంటాడో చూడాలి. 

click me!