Bigg Boss Telugu 6: శ్రీసత్య ఫైనల్ ఆశలు గల్లంతు... కీలక టైం లో దెబ్బతీసిన ఫ్రెండ్ రేవంత్!

Published : Nov 29, 2022, 01:34 PM IST
Bigg Boss Telugu 6: శ్రీసత్య ఫైనల్ ఆశలు గల్లంతు... కీలక టైం లో దెబ్బతీసిన ఫ్రెండ్ రేవంత్!

సారాంశం

బిగ్ బాస్ టికెట్ టు ఫినాలే టాస్క్ నిర్వహిస్తున్నాడు. టాస్క్ లో గెలిచిన కంటెస్టెంట్ నేరుగా ఫైనల్ కి చేరుకుంటాడు. ఫైనల్ కి బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న ఫస్ట్ కంటెస్టెంట్ అవుతాడు. ఈ టాస్ లో శ్రీసత్య ఓడిపోయినట్లు తెలుస్తుంది.   

ఇప్పటివరకు ఆట ఒకెత్తు ఇప్పటి నుండి ఒకెత్తు. కేవలం మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో సేఫ్ గేమ్ వదిలేసి కంటెస్టెంట్స్ టైటిల్ కోసం పోటీ పడాలని నాగార్జున చెప్పారు. హౌస్లో 8 మంది మాత్రమే ఉండగా ఎవరు టైటిల్ అందుకుంటారనే ఉత్కంఠ కొనసాగుతోంది. టైటిల్ కొట్టాలంటే ముందు ఫైనల్ కి వెళ్ళాలి. నేరుగా ఫైనల్ కి వెళ్లే ఛాన్స్ బిగ్ బాస్ కల్పించారు. బిగ్ బాస్ నిర్వహించిన టాస్క్ లో గెలిచిన కంటెస్టెంట్ టికెట్ టు ఫినాలే గెలుచుకుంటాడు. 

దీని కోసం గాలిలో నుండి పడుతున్న భాగాలు సేకరించి స్నోమాన్ బొమ్మ రూపొందించాలి. అలాగే ఎవరి స్నోమాన్ ని వారు కాపాడుకోవాలి. అందరికంటే అసంపూర్తిగా బొమ్మను రూపొందించిన కంటెస్టెంట్స్ రౌండ్స్ వైజ్ గా ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఈ టాస్క్ లో రేవంత్ ని బిగ్ బాస్ సంచాలకుడిగా నియమించాడు. కాగా మిగతా  కంటెస్టెంట్స్ తో పోల్చితే స్నోమాన్ ని సరిగా నిర్మించలేని కారణంగా శ్రీసత్య ఎలిమినేట్ అయ్యింది. దీంతో ఆమె ఫినాలే టికెట్ గెలుచుకునే అవకాశం కోల్పోయింది. 

శ్రీసత్య ఎలిమినేట్ కావడానికి సంచాలక్ గా ఉన్న రేవంత్ కూడా కారణమయ్యాడు. గేమ్ రూల్స్ విషయంలో శ్రీసత్య-రేవంత్ మధ్య వాగ్వాదం నడిచింది. నేను సంచాలక్ కాబట్టి నేను చెప్పించే ఫైనల్ అని రేవంత్ శ్రీసత్యకు షాక్ ఇచ్చాడు. మొత్తంగా శ్రీసత్య మంచి అవకాశం కోల్పోయింది. ఇనయా, కీర్తి కూడా ఈ టాస్క్ లో ఎలిమినేట్ అయినట్లు తెలుస్తుంది. రోహిత్-ఆదిరెడ్డి మధ్య టికెట్ టు ఫినాలే పోరు జరిగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో... 

కాగా ఈ వారం రాజ్ ఎలిమినేట్ అయ్యాడు. 21 మంది కంటెస్టెంట్స్ తో షో మొదలైంది. ఉన్న 8 మందిలో ఐదుగురు ఫైనల్ కి వెళ్తారు. మిగతా ముగ్గురు ఎలిమినేట్ అవుతారు. ఫైనల్ మినహాయిస్తే రెండు ఆదివారాలు మాత్రమే ఉన్నాయి. ఈ క్రమంలో ఒక మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ఊపేసేలా ఉన్న `దేఖ్‌ లేంగే సాలా` పాట.. మళ్లీ ఆ రోజులను గుర్తు చేసిన పవన్‌ కళ్యాణ్‌
అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే