Bigg Boss 5 Winner Sunny: బిగ్ బాస్ 5 విజేతగా అవతరించిన సన్నీ

Sreeharsha Gopagani   | Asianet News
Published : Dec 19, 2021, 10:32 PM ISTUpdated : Dec 19, 2021, 10:44 PM IST
Bigg Boss 5 Winner Sunny: బిగ్ బాస్ 5 విజేతగా అవతరించిన సన్నీ

సారాంశం

నరాలు తెగే ఉత్కంఠ నడుమ బిగ్ బాస్ సీజన్ 5 విజేత సన్నీ అని ప్రకటించారు. దీనితో సన్నీ బిగ్ బాస్ 5 విన్నర్ గా అవతరించాడు. షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. 

కింగ్ నాగార్జున హోస్ట్  గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఘనంగా జరుగుతోంది. గత 105 రోజులుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తూ వచ్చిన బిగ్ బాస్ తుది దశకు చేరుకోవడంతో విజేత ఎవరనే ఉత్కంఠ నెలకొంది. సిరి, షణ్ముఖ్, మానస్, శ్రీరామ్, సన్నీ టాప్ 5 కంటెస్టెంట్స్ గా నిలిచారు. చివరకు సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కు చేరారు. నరాలు తెగే ఉత్కంఠ నడుమ బిగ్ బాస్ సీజన్ 5 విజేత సన్నీ అని ప్రకటించారు. దీనితో సన్నీ బిగ్ బాస్ 5 విన్నర్ గా అవతరించాడు. షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. 

వీరిలో ముందుగా సిరి ఎలిమినేట్ అయింది. ఆ తర్వాత మానస్, శ్రీరామ్ ఎలిమినేట్ అయ్యారు. చివరకు సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కు చేరారు. శ్రీరామ్ టాప్ 3 గా వెనుదిరగడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఇక సన్నీ, షణ్ముఖ్ ఫైనల్ కి చేరడంతో అందరిలో ఉత్కంఠ పెరిగిపోయింది. ఎవరు విజేతగా నిలుస్తారు అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో కనిపించింది. 

టెన్షన్ ని రెట్టింపు చేసేలా బిగ్ బాస్ ఒక ఫేక్ గేమ్ ఆడారు. ప్రతి సీజన్ లో విజేత ఎవరో వేదికపై తెలుస్తుంది. ఈ సీజన్ లో హౌస్  లోనే తెలియబోతోంది అని నాగార్జున ప్రకటించారు. దీని కోసం నాగార్జున ఫరియా అబ్దుల్లాన్ని హౌస్ లోకి పంపారు. ఇద్దరూ చెరో బాక్స్ లో చేయి పెట్టారు. గ్రీన్ కలర్ వచ్చిన వారు విజేత అని నాగ్ తెలిపారు. 

కానీ  ఇద్దరి చేతికి బ్లూ కలర్ వచ్చింది. దీనితో ఇది ఫేక్ గేమ్ అని నాగార్జున మరోసారి టెన్షన్ పెట్టారు. ఆ తర్వాత నాగార్జున స్వయంగా హౌస్ లోకి వచ్చి ఇద్దరినీ వేదికపైకి తీసుకుని వెళ్లారు. అత్యంత ఉత్కంఠ నడుమ సన్నీని విజేతగా ప్రకటించారు. 

సన్నీ ఈ సీజన్ మొత్తం బాగా యాక్టివ్ గా ఉన్న కంటెస్టెంట్. అతడు విజయానికి అన్ని విధాలా అర్హుడు అంటూ అప్పుడే సోషల్ మీడియాలో శుభాకాంక్షలు మొదలయ్యాయి. రన్నరప్ గా నిలిచిన షణ్ముఖ్ కూడా బాగా పెర్ఫామ్ చేశాడని అంటున్నారు. అయితే శ్రీరామ్ టాప్ 3 గానే వెనుదిరగడం చాలా మందికి నిరాశ కల్గించింది అంశం. 

Also Read: Bigg Boss 5 Grand Finale: 'శ్యామ్ సింగ రాయ్' ఆఫర్ కి నో.. మానస్ అవుట్

Also Read: BiggBoss Telugu5 grand finale: టైటిల్ రేసు నుండి శ్రీరామచంద్ర అవుట్.. నాగ్ సలహా తీసుకొని ఉంటే కథ వేరేలా ఉండేది

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా