BiggBoss Telugu5 grand finale: టైటిల్ రేసు నుండి శ్రీరామచంద్ర అవుట్.. నాగ్ సలహా తీసుకొని ఉంటే కథ వేరేలా ఉండేది

Published : Dec 19, 2021, 10:13 PM IST
BiggBoss Telugu5 grand finale: టైటిల్ రేసు నుండి శ్రీరామచంద్ర అవుట్.. నాగ్ సలహా తీసుకొని ఉంటే కథ వేరేలా ఉండేది

సారాంశం

నాని తీసుకొచ్చిన సిల్వర్ బాక్స్ లో ఉన్న అమౌంట్ కంటే మూడు రెట్లు అధికంగా బాక్సులో ఉన్నట్లు నాగ చైతన్య చెప్పారు.

సిరి, మానస్ ఎలిమినేషన్ తర్వాత సన్నీ(Sunny), షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర మిగిలారు. ఇక థర్డ్ ఎలిమినేషన్ కి ముందు హౌస్ లోకి నాగ చైతన్య గోల్డెన్ బాక్స్ తో వెళ్లారు. నాని తీసుకొచ్చిన సిల్వర్ బాక్స్ లో ఉన్న అమౌంట్ కంటే మూడు రెట్లు అధికంగా బాక్సులో ఉన్నట్లు నాగ చైతన్య చెప్పారు. ఎలిమినేషన్ రివీల్ చేయబోయే ముందు కంటెస్టెంట్స్ కి మూడు నిమిషాల సమయం ఇచ్చారు నాగార్జున. ముగ్గురిలో ఖచ్చితంగా ఒకరు ఎలిమినేట్ అవుతారు, కాబట్టి వట్టి చేతులతో వెళ్లకుండా డబ్బులు తీసుకోవడం మంచి ఆలోచన అంటూ మోటివేట్ చేసే ప్రయత్నం చేశారు. 

అయితే ముగ్గురు కంటెస్టెంట్స్ డబ్బులు తీసుకొని రేసు నుండి తప్పుకోవడాని సిద్ధపడలేదు. నాగార్జున(Nagarjuna) వాళ్ళ పేరెంట్స్ ని కూడా అడిగారు. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ పేరెంట్స్ నాగార్జున ఆఫర్ చేసిన గోల్డెన్ బాక్స్ లోని డబ్బులు తీసుకోవడనికి ఇష్టపడలేదు. దీనితో ఎలిమినేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు నాగార్జున. గార్డెన్ ఏరియాలో ఉన్న మూడు కుండల నుండి పొగ వస్తూ ఉంటుంది. సన్నీ, శ్రీరామ్, షణ్ముఖ్ పేర్లతో కూడిన ఆ మూడు కుండల్లో, ఎర్ర రంగు పొగ వచ్చిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతాడని నాగార్జున తెలిపారు. 

ఇక సింగర్ శ్రీరామ చంద్ర (Srirama Chandra)ఫోటో ఉన్న కుండ నుండి ఎర్ర రంగు రాగా... అతడి ఎలిమినేషన్ కన్ఫర్మ్ అయ్యింది. దీనితో నాగ చైతన్య.. శ్రీరామ చంద్రను వెంటబెట్టుకొని వేదికపైకి వచ్చాడు. అనంతరం నాగార్జున ఆఫర్ చేసిన గోల్డెన్ బాక్స్ లో రూ. 20 లక్షల అమౌంట్ ఉందని నాగార్జున తెలియజేశారు. అలాగే నువ్వు ఈ ఆఫర్ తీసుకోవాల్సిందని శ్రీరామ్ కి తెలిపాడు. ఎవరో ఒకరు గెలవాలి కదా అని శ్రీరామ్ అనగా... మీరందరూ విన్నర్స్ అని నాగార్జున చెప్పారు. 

Also read Bigg Boss Telugu 5 grand finale: మిగిలింది ముగ్గురే... బిగ్ బాస్ టైటిల్ దక్కేది ఎవరికి?
ఇక హౌస్ లోకి వెళ్లడం ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను.. ఇకపై ఓ కొత్త శ్రీరామ చంద్రను చూస్తారని ఆయన అన్నారు. శ్రీరామ చంద్ర ఎలిమినేషన్ తో టైటిల్ (BiggBoss Telugu5 grand finale) పోరులో సన్నీ, షణ్ముఖ్ నిలిచారు. వీరిద్దరిలో ఒకరు విన్నర్ మరొకరు రన్నర్ కానున్నారు. 

Also read Bigg Boss 5 Grand Finale: 'శ్యామ్ సింగ రాయ్' ఆఫర్ కి నో.. మానస్ అవుట్

PREV
click me!

Recommended Stories

సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్