
మొదటి ఎలిమినేషన్ ఊహించినదే. హౌస్ లో ఉన్న ఫైవ్ కంటెస్టెంట్స్ లో సిరి ఎలిమినేట్ అయ్యారు. రెండవ ఎలిమినేషన్ లో నాటకీయత చోటు చేసుకుంది. శ్యామ్ సింగరాయ్ టీమ్ దీని కోసం హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హీరోయిన్స్ కృతి సనన్, కృతి శెట్టిలతో పాటు హీరో నాని హౌస్ కి వెళ్లడం జరిగింది. కాగా నాని ఓ పెట్టెతో వచ్చి హౌస్ మేట్స్ ని టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు. పెట్టెలో ఉన్న డబ్బులు తీసుకొని ఒకరు వెళ్లిపోవచ్చనే ఆఫర్ ఇవ్వగా.. నలుగురు కంటెస్టెంట్స్ శ్రీరామ్, సన్నీ, షణ్ముఖ్, మానస్ తీసుకోలేదు.
ఇక సెకండ్ ఎలిమినేషన్ ద్వారా మానస్ బయటికి వచ్చారు. దీనితో నాని మానస్ ఎలిమినేషన్ కన్ఫర్మ్ చేసి బయటకు తీసుకురావడం జరిగింది. మానస్ ఎలిమినేషన్ తో శ్రీరామ్, షణ్ముఖ్, సన్నీ టైటిల్ పోరులో నిలిచారు. ఈ ముగ్గురిలో టైటిల్ అందుకునేది ఎవరనే ఉత్కంఠ మొదలైపోయింది.
ఫస్ట్ ఎలిమినేషన్ ద్వారా ఐదవ స్థానం పొందిన సిరి షణ్ముఖ్ టైటిల్ అందుకోవాలని కోరుకున్నారు. ఇక మానస్ తన బెస్ట్ ఫ్రెండ్ సన్నీ గెలవాలని కోరుకున్నాడు. మొదట్నుండి కష్టపడిన వాడిగా సన్నీకి ఆ అర్హత ఉంది. ప్రేక్షకులు తనకే ఎక్కువ ఓట్లు వేసి ఉంటారన్న అభిప్రాయం వెల్లడించారు. మరి నీవు సరిగా ఆడలేదా.. అన్న నాగార్జున ప్రశ్నకు మానస్.. నేను కూడా బాగా ఆడాను, కానీ నాకంటే సన్నీ ఆట ప్రేక్షకులకు నచ్చిందన్నారు.
Also read Bigg Boss 5 Grand Finale: 'శ్యామ్ సింగ రాయ్' ఆఫర్ కి నో.. మానస్ అవుట్
టాప్ సెలబ్రిటీల రాకతో బిగ్ బాస్ ఫైనల్ (Bigg Boss Telugu 5 grand finale)సందడిగా మారింది. స్టార్స్ స్టేజ్ పెర్ఫార్మన్స్ తో ప్రేక్షకులకు ఉత్కంఠతో పాటు ఫుల్ ఎంటర్టైన్మెంట్ పంచారు. నేటితో బిగ్ బాస్ ఆట ముగియనుండగా టైటిల్ విన్నర్ కోసం ఎదురుచూస్తున్నారు.
Also read BIG BOSS-5 ALIA BHAT: ఐలవ్యూ చెప్పిన ఆలియా భట్.. తట్టుకోలేక పడిపోయిన సన్నీ.