నందమూరి బాలకృష్ణతో కూడా చిరంజీవి కుటుంబానికి వైరుధ్యం ఉంది. 2019 ఎన్నికలకు ముందు Balakrishnaపై నాగబాబు సిరీస్ ఆఫ్ వీడియోలు చేశారు. వివిధ సందర్భాల్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేశారు.
మోహన్ బాబు, బాలకృష్ణతో మెగా ఫ్యామిలీకి విబేధాలు ఉన్నాయి. ఇది పరిశ్రమతో పాటు అందరికీ తెలిసిన నిజం. 75ఏళ్ళు పూర్తి చేసుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ వైభవాన్ని గుర్తు చేసుకుంటూ పరిశ్రమ పెద్దలు అందరూ కలిసి 2007లో వజ్రోత్సవ వేడుకలు మూడు రోజులు నిర్వహించారు. సీనియర్ నటులకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, కొందరికి కనీస ఆహ్వానం లేకపోవడంతో ఈ వేడుక విమర్శలపాలైంది. ఇక చిరంజీవికి లెజెండ్ అవార్డు ఇచ్చి, తనకు ఇవ్వకపోవడాన్ని Mohan babu తప్పుబడ్డారు. 500లకు పైగా చిత్రాలు చేసిన నేను ఎవరికి తక్కువ అంటూ... ఓపెన్ అయ్యారు.
మోహన్ బాబు ఆరోపణలకు ఆ వేదికపై నుండే చిరంజీవి, పవన్ కళ్యాణ్ కౌంటర్లు ఇచ్చారు. ఆ సంఘటన చిరు, మోహన్ బాబు కుటుంబాల మధ్య అగాధం ఏర్పరిచింది. అయితే సడన్ గా రెండేళ్లుగా మోహన్ బాబు, Chiranjeevi చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటున్నారు. ఒకరికి మరొకరు బహుమతులు ఇచ్చుకోవడం, కలిసి విహారాలు చేయడం చేశారు. అయితే మా ఎన్నికల కారణంగా చిరు, మోహన్ బాబు మధ్య మరోమారు గొడవలు ఏర్పడ్డాయి. మోహన్ బాబు ఫ్యామిలీ నుండి మంచు విష్ణు అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన ప్రకాష్ రాజ్ కి చిరు మద్దతు తెలిపారు. రెండు నెలలకు పైగా MAA electons టాలీవుడ్ లో ఎంతటి రాద్ధాంతం సృష్టిస్తున్నాయో చూస్తున్నాము.
కాగా నందమూరి బాలకృష్ణతో కూడా చిరంజీవి కుటుంబానికి వైరుధ్యం ఉంది. 2019 ఎన్నికలకు ముందు Balakrishnaపై నాగబాబు సిరీస్ ఆఫ్ వీడియోలు చేశారు. వివిధ సందర్భాల్లో బాలయ్య చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయన ఇమేజ్ ని డామేజ్ చేసే ప్రయత్నం చేశారు. ఆ గొడవ అలా సద్దుమణిగింది అనుకుంటే.. కరోనా సంక్షోభ సమయంలో చిరు అధ్యక్షతన ఇండస్ట్రీ పెద్దలు తెలంగాణా ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ మీటింగ్ కి తనను పిలవకపోవడంపై బాలయ్య ఫైర్ అయ్యారు. అందరూ కలిసి భూములు పంచుకుంటున్నారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై నాగబాబు స్పందించారు. బాలయ్య పరిశ్రమ పెద్దలకు, తెలంగాణా గవర్నమెంట్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
Also read మెగాస్టార్ తో పవర్ స్టార్ ముచ్చట్లు... పెళ్ళిలో కలిసి సందడి చేసిన మెగా బ్రదర్స్
మరి అలాంటి బాలయ్య మెగా ఫ్యామిలీ లో భాగమైన అల్లు అరవింద్ కోసం టాక్ షో చేయడం విశేషత సంతరించుకుంది. మెగా ఫ్యామిలీకి శత్రువుగా ఉన్న బాలకృష్ణను తన యాప్ కోసం అల్లు అరవింద్ రంగంలోకి దించారు. వాళ్ల గొడవలతో మాకు సంబంధం లేదు, వ్యాపారం, అభివృద్దే ముఖ్యం అన్నట్లు అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నారు. ఇక బాలయ్య టాక్ షో అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ గెస్ట్ మోహన్ బాబు కావడం మరో ట్విస్ట్. దీనితో చిరు శత్రులుగా ఉన్న బాలయ్య, మోహన్ బాబు అల్లు అరవింద్ కి మాత్రం మిత్రులు అయ్యారు. ఆహా యాప్ అభివృద్ధి కోసం తమ వంతు సాయం చేస్తున్నారు.
Also read తమ్ముడి కోసం విజయ్ దేవరకొండ ఫైటింగ్... ఆ రోజుల్లోనే గ్రూపులు కట్టిన రౌడీ హీరో
అలాగే మెగా ఫ్యామిలీ విభేదాలలో అల్లు అరవింద్ ఫ్యామిలీ తలదూర్చడం లేదు. ఇందుకు మా ఎన్నికలు పెద్ద ఉదాహరణ. నాగబాబు, మోహన్ బాబు, Pawan kalyan, మంచు విష్ణుల మధ్య ఎన్ని ఆరోపణలు, కౌంటర్ కామెంట్స్ చోటు చేసుకున్నా, అల్లు ఫ్యామిలీ నుండి ఎవరూ నోరు మెదపలేదు. సైలెంట్ గా తమకు నచ్చిన అభ్యర్ధికి ఓటు వేశారు. అల్లు అర్జున్ అసలు ఓటింగ్ లో పాల్గొనలేదు. ఇక టాక్ షో లాంఛింగ్ ఈవెంట్ లో బాలయ్య, సక్సెస్ ఫుల్ హీరో అంటూ అల్లు అర్జున్ పై ప్రసంశలు కురిపించారు. అల్లు ఫ్యామిలీతో ఎన్టీఆర్ కి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేధావిగా పేరున్న అల్లు అరవింద్ విబేధాల వలన ఒరిగేది ఏమిలేదని గుర్తించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది.