Kaikala Satyanarayaana: కైకాల సత్యనారాయణ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్... కాపాడడం చాలా కష్టం!

Published : Nov 20, 2021, 07:27 PM ISTUpdated : Nov 20, 2021, 07:42 PM IST
Kaikala Satyanarayaana: కైకాల సత్యనారాయణ ఆరోగ్యపరిస్థితిపై హెల్త్ బులెటిన్... కాపాడడం చాలా కష్టం!

సారాంశం

సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో హాస్పిటల్ లో జాయిన్ కాగా , డాక్టర్స్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఆయన పరిస్థితి, అత్యంత విషమంగా ఉన్నట్లు తెలియజేశారు. 

జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కైకాల సత్యనారాయణ హెల్త్ కండీషన్ పై డాక్టర్స్ మీడియా బులెటిన్ విడుదల చేయగా, ఆందోళన కలిగిస్తుంది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు డాక్టర్స్ ప్రెస్ నోట్ లో వెల్లడించారు. ఐసీయూలో రెస్పిరేటరీ సిస్టమ్ పై ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఆయన శరీరంలోని ప్రధాన అవయవాలు విఫలం చెందినట్లు వెల్లడించిన వైద్యులు, కాపాడడం కూడా చాలా కష్టం అన్నట్లు ధృవీకరించారు. 


నేడు ఉదయం కైకాల సత్యనారాయణ జ్వరం, నీరసంతో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. కండీషన్ క్రిటికల్ గా ఉన్నట్లు గుర్తించారు. వైద్యుల బృందం ఆయనను కాపాడడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. ఫలితం పై మాత్రం నమ్మకం లేదని తెలియజేస్తున్నారు. కళామతల్లి ముద్దు బిడ్డగా ఆరు దశాబ్దాలు సేవలు అందించిన కైకాల సత్యనారాయణ కోలుకొని తిరిగి రావాలని, ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. 

కొద్ది రోజుల క్రితం కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayaana) ఇంట్లో కాలుజారి కిందపడటంతో గాయాలై ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. చికిత్స తర్వాత కాస్త ఆరోగ్యం మెరుగుపడిందని వార్తలు వచ్చాయి. 86 ఏళ్ల కైకాల సత్యనారాయణ టాలీవుడ్ మొదటితరం నటుల్లో అగ్రగణ్యుడు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి అగ్రనటులతో వందల కొద్దీ సినిమాలలో కలిసి నటించారు. పౌరాణిక, చారిత్రక, జానపద, సోషల్ ఇలా భిన్నమైన జోనర్స్ లో 700 వందలకు పైగా చిత్రాలలో కైకాల సత్యనారాయణ నటించారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్