Bigg Boss Telugu5: బిగ్ బాస్ లీక్.. హౌస్ నుండి ప్రియాంక అవుట్... మానస్ పరిస్థితి ఏమిటో!

Published : Dec 04, 2021, 02:48 PM IST
Bigg Boss Telugu5: బిగ్ బాస్ లీక్.. హౌస్ నుండి ప్రియాంక అవుట్... మానస్ పరిస్థితి ఏమిటో!

సారాంశం

ఎలిమినేషన్ కొరకు సిరి, మానస్, శ్రీరామ్, ప్రియాంక, కాజల్ నామినేట్ అయ్యారు. ఇక టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీరామ్ ఎలిమినేటయ్యే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఫినాలే టికెట్ గెలుచుకున్నంత మాత్రాన అతడు ఎలిమినేట్ అవడానికి అవకాశం లేదని మాత్రం కాదు. 

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg Boss Telugu5) రసకందాయంలో పడింది. మరో మూడు వారాల్లో టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. నిన్న ఎపిసోడ్ లో సింగర్ శ్రీరామ్ టికెట్ లో ఫినాలే గెలుచుకున్నారు. దీని కోసం మానస్ తో హోరాహోరీగా తలపడిన శ్రీరామ్ ఫైనల్ టాస్క్ లో అతడ్ని ఓడించిన ఫైనల్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు. కాగా ఈ వారం హౌస్ నుండి ఎలిమినేటయ్యే కంటెస్టెంట్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతుంది. యాంకర్ రవి ఎలిమినేషన్ తో హౌస్ లో ఏడుగురు కంటెస్టెంట్స్ మిగిలారు. 


వీరిలో  ఎలిమినేషన్ కొరకు సిరి, మానస్, శ్రీరామ్, ప్రియాంక, కాజల్ నామినేట్ అయ్యారు. ఇక టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీరామ్ ఎలిమినేటయ్యే అవకాశాలు చాలా తక్కువ. అయితే ఫినాలే టికెట్ గెలుచుకున్నంత మాత్రాన అతడు ఎలిమినేట్ అవడానికి అవకాశం లేదని మాత్రం కాదు. కాగా ఈ వారం  ప్రియాంక (Priyanka) హౌస్ ను వీడనున్నారట. నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో అతి తక్కువ  ఓట్లు పొందిన ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారని విశ్వసనీయ సమాచారం అందుతుంది. 


ఇక మొదటి నుండి ఎలిమినేషన్స్ విషయంలో ముందుగా ప్రచారం అవుతున్న కంటెస్టెంట్స్ హౌస్ ని వీడుతున్నారు. కాబట్టి ప్రియాంక ఎగ్జిట్ ఖాయమే అంటున్నారు. ప్రియాంక ఎలిమినేషన్ తో హౌస్ లో ఫుల్ ఎమోషనల్ సన్నివేశం చోటు చేసుకునే అవకాశం కలదు. తన ప్రియుడు మానస్ ని వదిలి పోవడం ప్రియాంకకు నరకప్రాయమే అని చెప్పాలి. మానస్ ని  వదిలి వెళ్లలేక ప్రియాంక బిగ్ బాస్ హౌస్ ని కన్నీళ్లతో నింపేస్తుందేమో చూడాలి. 

Also read Bigg Boss Telugu 5: ఫైనలిస్ట్ గా శ్రీరామ్‌ విన్నర్‌.. కాజల్‌పై సన్నీ ఫైర్‌.. చప్పగా సాగుతున్న బిగ్‌బాస్‌ షో
బిగ్ బాస్ సీజన్ 3లో ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చారు. ఆమె చాలా త్వరగానే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ప్రియాంక మాత్రం హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగారు. 

Also read Skylab: నిత్యామీనన్ 'స్కైలాబ్' సినిమా రివ్యూ

PREV
click me!

Recommended Stories

ఆ డైరెక్టర్ ఫోన్ చేసి ఐదుగురితో కమిట్‌మెంట్ అడిగాడు.. టాలీవుడ్ నటి ఓపెన్ స్టేట్‌మెంట్
నాగార్జున ఫ్లాప్ మూవీ గురించి చెప్పిన డైరెక్టర్, నయనతారకి సర్ప్రైజ్.. అందుకే చిరంజీవి సినిమాకి ఒప్పుకుందా