Bheemla Nayak: భీమ్లానాయక్​ నుంచి క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ కోసం గ‌ళం విప్ప‌నున్న పవన్​ ! ఇక పునకాలే!

By team telugu  |  First Published Dec 4, 2021, 1:12 PM IST

పవన్ కళ్యాణ్, రానా క్రేజీ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం కోసం ప‌వ‌న్ క‌ళ్యాన్   త‌న గాత్రాన్ని విప్పిన‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.
 


Bheemla Nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా క్రేజీ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మలయాళంలో సూపర్‌ హిట్‌గా నిలిచిన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ సినిమాకు రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ సరసన నిత్యామీనన్, ఇక రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తోంది. ఈ సినిమాకి ఎస్.ఎస్.తమన్ సంగీతం అందిస్తుండగా, మాటల మాంత్రికుడు, డైరెక్ట‌ర్ త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే బాధ్యతలు  నిర్వ‌హించ‌డం స్పెష‌ల్. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుక‌రానున్నారు చిత్ర నిర్మాత‌లు. 
 
ఈ చిత్రంలో పవన్‌, రానాలు నాయ‌క‌, ప్ర‌తినాయ‌కులుగా న‌టిస్తోన్నారంటనే.. హైప్స్ క్రియేట్ అయ్యాయి. కోట్లాది భారీ బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్ప‌టికే పవన్‌, రానా ఫస్ట్‌లుక్స్ కు భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ అంచనాల‌ను అలానే కొన‌సాగించాల‌ని త‌రుచు  ఏదొక అప్డేట్ ఇస్తున్నారు మూవీ మేక‌ర్స్. నిన్న కాక మొన్ననే రిలీజైన టైటిల్‌ అండ్‌ ఫస్ట్ గ్లింప్స్‌ యూట్యూబ్ దద్దరిల్లేలా రీసౌండ్‌ చేసింది. దీంతో ఎక్కడలేని జోష్ అభిమానుల్లో వ‌చ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కూ భీమ్లా నాయక్ నుంచి విడుద‌లైన ప్ర‌తి గ్లింప్స్, సాంగ్స్  టాప్‌లో నిలిచాయి. రిలీజైన గంటలోనే ట్రెండింగ్‌లో నిలిపారు. తాజాగా ఈ చిత్రం నుంచి నాలుగో పాట‌గా.. అడవి తల్లి టైటిల్​తో మరో పాటను విడుదల చేయ‌బోతుంది. ఈ పాట భీమ్లా నాయక్ సినిమా స్టోరీని ప్ర‌తిబింబించేలా ఉండ‌బోతుంద‌ని తెలుస్తుంది. 

Read Also: https://telugu.asianetnews.com/entertainment/bheemla-nayak-fourth-single-update-r3jhu1

Latest Videos

ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో నుంచి మరో క్రేజీ అప్డేట్ వ‌చ్చింది. ఈ చిత్రంలో ప‌వ‌న్ క‌ళ్యాన్ ఓ పాట కోసం త‌న గాత్రాన్ని విప్పిన‌ట్టు తెలుస్తోంది. గ‌తంలో మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ కూడా ఈ సినిమాలో ప‌వ‌న్ కళ్యాన్ గారితో క‌చ్చితంగా ఓ పాట పాడిస్తాన‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.. ఇప్పుడూ ఈ పాటకు సంబంధించిన‌ రికార్డింగ్ పూర్తి అయిన‌ట్టు టాక్. ప‌వ‌న్ పాట పక్కా మాస్​ బీట్​తో సాగనున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటో కూడా ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ విష‌యం తెలుసుకున్న పవ‌న్ ఫ్యాన్ కు ఆనందానికి అవ‌ధుల్లేవు. అయితే, తాజాగా ఆ మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Read Also: https://telugu.asianetnews.com/entertainment/pawan-kalyan-bheemla-nayak-update-fourth-single-date-and-time-fix-r3jfs7

 సాధార‌ణంగా  మ్యూజిక్ డైరెక్టర్స్ థమన్ కొత్త సింగర్స్ ని బాగా ఎంకరేజ్ చేస్తాడు. తన సినిమాల్లోని పాటల ద్వారా ఎంతోమందికి ఇండస్ట్రీలో అవకాశం ఇచ్చాడు. ఇక అప్పుడప్పుడు సెలబ్రిటీలతోను పాడిస్తాడు థమన్. అంతకుముందు ఎన్టీఆర్, సుమ లాంటి సెలబ్రిటీలతో పాడించాడు. ఇక‌ పవన్ కూడా గ‌తంలో అనేక సార్లు తన అభిమానుల కోసం పాట పాడిన విష‌యం తెలిసిందే.
 
 

click me!