Priyanka Eliminated: షణ్ముఖ్‌ ముదిరిన బెండకాయ.. మానస్‌ నుంచి ఆశించేది అదేనట.. పింకీ ఊహించని కామెంట్స్

Published : Dec 06, 2021, 12:35 AM IST
Priyanka Eliminated: షణ్ముఖ్‌ ముదిరిన బెండకాయ.. మానస్‌ నుంచి ఆశించేది అదేనట.. పింకీ ఊహించని కామెంట్స్

సారాంశం

ఎలిమినేట్‌ అయిన తర్వాత హోస్ట్ నాగార్జున వద్దకి స్టేజ్‌కి వెళ్లిన ప్రియాంక తన జర్నీని చూసుకుని మరింత ఎమోషనల్‌ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది.

బిగ్‌బాస్‌ తెలుగు 5.. 13వ వారం ముగిసింది. ఊహించినట్టే ప్రియాంక సింగ్‌ ఎలిమినేట్ అయ్యారు. అయితే పింకీ ఎలిమినేషన్‌ హౌజ్‌ మేట్స్ లో బాధని మిగిల్చింది. 13వ వారం అంటే అందరి సభ్యుల మధ్య మంచి బాండింగ్‌ ఏర్పడింది. దీంతో సభ్యుల తగ్గే కొద్ది వారి మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. అందులోనూ ప్రియాంక సింగ్‌తో ఉన్నే ఆ అనుబంధం ప్రత్యేకం. దీంతో అంతా ఎమోషనల్‌ అయ్యారు. అయితే హౌజ్‌నుంచి తాను ఎలిమినేట్‌ అయ్యాననే తీర్పుతో పింకీ కూడా చాలా భావోద్వేగానికి గురైంది. ముఖ్యంగా మానస్‌ని విడిచివెళ్లడంపై ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. 

ఎలిమినేట్‌ అయిన తర్వాత హోస్ట్ నాగార్జున వద్దకి స్టేజ్‌కి వెళ్లిన ప్రియాంక తన జర్నీని చూసుకుని మరింత ఎమోషనల్‌ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. అయితే తన జర్నీ గొప్పదని, అనేక మందికి ఇన్‌స్పైరింగ్‌గా నిలుస్తావని తెలిపారు నాగార్జున. అదే సమయంలో డాక్టర్‌ ప్రియాంక అంటూ ఆటపట్టించాడు. ఈసందర్భంగా ఇంటి సభ్యుల నుంచి తన అభిప్రాయాలు పంచుకుంది ప్రియాంక. హౌజ్‌లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడెలా ఉన్నారనే విషయాన్ని వెల్లడించింది. 

మొదట సిరి గురించి చెబుతూ, తనది వైజాగ్‌ అని తెలిసి ఫ్రెండ్స్ అయిపోయామని, ఒరేయ్‌ పింకీ, ఒరేయ్‌ సిరి అని పిలుచుకున్నట్టు చెప్పింది. ఇప్పుడు తనకు ఓ చెల్లి ఫీలింగ్‌ కలుగుతుందని, అదే విషయాన్ని సిరికి కూడా చెప్పానని తెలిపింది ప్రియాంక. శ్రీరామ్‌ గురించి చెబుతూ, హౌజ్‌లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలానే ఉన్నాడని తెలిపింది. షణ్ముఖ్‌ గురించి చెబుతూ ఓ షాకింగ్‌ కామెంట్‌ చేసింది ప్రియాంక. హౌజ్‌లోకి వచ్చినప్పుడు తనకు తమ్ముడిలాంటి వాడని అనుకున్నానని, తర్వాత తాను అనుకున్నది తప్పని, ఆయన ముదిరిపోయిన బెండకాయ అని తెలిసి అన్నగా పిలుచుకుంటున్నట్టు చెప్పింది. దీంతో నాగార్జున కూడా ముందే ఈ విషయం చెబితే అలానే పిలిచే వాళ్లం కదా అంటూ ఆటపట్టించే ప్రయత్నం చేశాడు. 

అయితే తాను వెళ్లిపోతున్నట్టు షణ్ముఖ్‌ అన్నయ్య ఏడ్వడం ఆయన ప్రేమని తెలియజేసిందని తెలిపింది. సన్నీ గురించి చెబుతూ, అన్నయ్య లాంటి ఫీలింగ్‌ కలిగిందని, ఇప్పటికీ అలానే ఉందని, తనకు ఎంతో ధైర్యాన్నిచ్చాడని చెప్పింది. చాలా మిస్‌ అవుతున్నాని, టాప్ లో ఉండాలని సన్నీకి చెప్పింది ప్రియాంక. కాజల్‌ గురించి చెబుతూ, కొత్తలో ఆమెని చూసి చాలా అల్లరి చేస్తుందనుకున్నానని, ఇప్పటికీ అదే అల్లరి చేస్తుందని, కానీ బాగా నచ్చుతుందని తెలిపింది. 

మానస్‌ గురించి చెబుతూ.. హౌజ్‌లోకి వచ్చినప్పుడు సిల్కీ హెయిర్‌తో బాగున్నాడనిపించిందని, ఆయన్ని పలకరించగా, పట్టిచుకోకుండా వెళ్లిపోయాడని, ఈ అబ్బాయి ఎంత పొగరు అనుకున్నట్టు తెలిపింది. తర్వాత తమ మధ్య మంచి బాండింగ్‌ ఏర్పడిందని తెలిపింది ప్రియాంక. అయితే తన నుంచి ఏం ఆశిస్తున్నావనే ప్రశ్నకి చెబుతూ తనని విన్నర్‌గా చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో  ఎప్పటికీ మానస్‌ ఫ్రెండ్‌షిప్‌ కావాలని కోరుకుంటున్నానని వెల్లడించింది. తన కోసం పాట పాడమనగా, మానస్‌ ఓ పాట పాడారు. ఆ తర్వాత శ్రీరామ్‌ కూడా ఓ పాట పాడి హౌజ్‌ ఎమోషనల్‌గా మార్చేశాడు. 

అంతకు ముందు హౌజ్‌మేట్స్ తో గేమ్‌ ఆడించాడు హోస్ట్ నాగార్జున. లూడో గేమ్‌, పాటల పేర్లని నోట్లో వాటర్‌ పెట్టుకుని చెప్పడం, అంతకు ముందు హౌజ్‌ మేట్స్ క్యారెక్టర్స్ ఏంటీ? అనే విషయాలపై గేమ్‌ నిర్వహించాడు నాగ్‌. నవ్వులు పండించారు. సండేని ఫండేగా మార్చారు. ప్రియాంక ఎలిమినేషన్‌తో 13వ వారం పూర్తయ్యింది. ప్రస్తుతం హౌజ్‌లో సన్నీ, షణ్ముఖ్‌, శ్రీరామ్‌, మానస్‌, కాజల్‌, సిరి ఉన్నారు. ఇంకా రెండు వారాలు మాత్రమే బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ షో మిగిలి ఉంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: అలాంటి వాళ్ళు కప్ గెలిచినట్లు చరిత్రలో లేదు, ఈసారి బిగ్ బాస్ టైటిల్ ఎవరిదంటే ?
Kartik Aaryan: చెల్లి పెళ్లి వేడుకలో హంగామా చేసిన యంగ్ హీరో, సందడి మొత్తం అతడిదే.. వైరల్ ఫోటోస్