ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ కన్ఫర్మ్ చేసిన మహేష్!

By team telugu  |  First Published Dec 6, 2021, 7:59 AM IST

స్టార్స్ హీరోలు కలిసి ఓ మూవీలో నటించడం శుభపరిణామం. ఓ వర్గం ఆడియన్స్ దీనికి కోరుకుంటున్నారు. కాగా మహేష్ ఇప్పటికే ఓ మల్టీస్టారర్ చేశారు. 


టాలీవుడ్ లో మల్టీస్టారర్స్ ట్రెండ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది. మెగా, నందమూరి వంశాల హీరోలు ఓ మూవీలో కలిసి నటిస్తారని ఎవరూ ఊహించలేదు. దర్శకధీరుడు రాజమౌళి దీనిని నిజం చేసి చూపించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ గా ఉన్న ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో కలిసి నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ లో కొన్ని మల్టీస్టారర్స్ తెరకెక్కుతున్నాయి. భీమ్లా నాయక్ చిత్రంలో పవన్ (Pawan kalyan), రానా కలిసి నటిస్తుండగా... ఎఫ్ 3 చిత్రంలో వెంకటేష్, వరుణ్ స్క్రీన్ పంచుకుంటున్నారు. అలాగే ఆచార్య చిత్రం ద్వారా మెగాస్టార్ చిరంజీవి- చరణ్ కాంబినేషన్ లో మల్టీస్టారర్ తెరకెక్కుతుంది. 


స్టార్స్ హీరోలు కలిసి ఓ మూవీలో నటించడం శుభపరిణామం. ఓ వర్గం ఆడియన్స్ దీనికి కోరుకుంటున్నారు. కాగా మహేష్ ఇప్పటికే ఓ మల్టీస్టారర్ చేశారు. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో ఆయన వెంకీ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ భారీ విజయం అందుకుంది. ఎన్టీఆర్, పవన్, ప్రభాస్ వంటి టాప్ స్టార్స్ తో మహేష్ మల్టీస్టారర్ చేస్తే చూడాలనేది సినిమా ప్రియుల కోరిక. 

Latest Videos


మరి ఈ విషయంపై మహేష్ (Mahesh babu) తాజాగా స్పందించారు. ఎన్టీఆర్ హోస్ట్ గా కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి మహేష్ గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ షో వేదికగా మహేష్-ఎన్టీఆర్ (NTR)మధ్య పలు ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. వాటిలో ఎన్టీఆర్ తో మహేష్ మల్టీస్టారర్ టాపిక్ ఒకటి. గతంలో మనం ఇద్దరం దీని గురించి మాట్లాడుకున్నాం.. తర్వాత ఇద్దరం బిజీ కావడం వలన కుదరలేదని... మహేష్ ఎన్టీఆర్ ని ఉద్దేశించి అన్నారు. 

Also read ఎన్టీఆర్‌ని ఆటాడుకున్న మహేష్‌.. రాజమౌళి మీకు అన్ని ఆటలు చూపిస్తాడంటూ మహేష్‌కి తారక్‌ హెచ్చరిక..గెలిచిందేంతంటే?

ఖచ్చితంగా ఎన్టీఆర్ తో మల్టీస్టారర్ చేయాలనే ఆలోచన ఉందని తెలియజేశారు. ఇంకా మాట్లాడుతూ టాలీవుడ్ స్టార్స్ మధ్య మంచి సంబంధాలు నెలకొని ఉన్నాయి. ఒకరితో మరొకరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగు ప్రేక్షకులు చాలా మల్టీస్టారర్స్ చూడబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. గొప్ప దర్శకులు పరిశ్రమలో ఉండగా.. ఇది సాధ్యమే అని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది.

Also read Mahesh Babu with Balakrishna బాలయ్య తో మహేష్... బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ కి సిద్ధం కండి!
 

click me!