Bigg boss telugu5: యాని మాస్టర్ బిగ్ బాస్ హౌస్ కి రావడం వెనుక ఉద్దేశం అదే... అసలు విషయం బయటపెట్టిన మోనాల్

Published : Nov 17, 2021, 10:48 AM IST
Bigg boss telugu5: యాని మాస్టర్ బిగ్ బాస్ హౌస్ కి రావడం వెనుక ఉద్దేశం అదే... అసలు విషయం బయటపెట్టిన మోనాల్

సారాంశం

బిగ్ బాస్ షో (Bigg boss telugu5) మరికొన్ని వారాలలో ముగియనుంది. ప్రస్తుతం హౌస్ లో తొమ్మిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఫైనల్ కి చేరువ అవుతున్న నేపథ్యంలో పోటీ రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో హౌస్ లో ఉన్న తమ ఫేవరేట్ కంటెస్టెంట్స్ ని కొందరు సెలెబ్రిటీలు సప్పోర్ట్ చేస్తున్నారు.   


బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న మోనాల్ గజ్జర్ (Monal gajjar) అనూహ్యంగా యాని మాస్టర్ కి మద్దతుగా నిలిచారు. ఆమెకు ఓటు వేసి సప్పోర్ట్ చేయాలంటూ సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. కొరియోగ్రాఫర్ యాని మాస్టర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లో ఉన్నారు. భాష పూర్తిగా రాకున్నా ఫైటింగ్ స్పిరిట్ కనబరుస్తూ... ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే హౌస్లో ఆమె ఒక వర్గానికి దగ్గరగా ఉండడం అనేది, మైనస్ అని చెప్పాలి. 


ముఖ్యంగా ఆర్జే కాజల్ అంటే యాని మాస్టర్ కి అస్సలు పడదు. అలానే కాజల్ సైతం యాని మాస్టర్ అంటే మండిపడుతూ ఉంటారు. నామినేషన్స్ కావచ్చు, టాస్క్స్ కావచ్చు... వీరిద్దరూ ఒకరిని మరొకరు టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం హౌస్ లో మానస్, ప్రియాంక, కాజల్, సన్నీ ఒక గ్రూప్ గా ఉన్నారు. యాని మాస్టర్, రవి, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్ ఓ గ్రూప్ గా ఉన్నారు. 


అయితే కాజల్ విషయంలో యాని మాస్టర్ (Anee master) ప్రవర్తనపై కొందరు నెటిజెన్స్ పెదవి విరుస్తున్నారు. ఎప్పుడూ కాజల్ ని వెక్కిరిస్తూ ఉండే యాని మాస్టర్ బిహేవియర్ ఇరిటేటింగ్ గా ఉందన్న అభిప్రాయం వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఆమెను హౌస్ నుండి బయటికి పంపాలని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. 

Also read Bigg Boss Telugu 5: షణ్ముఖ్ రెచ్చగొట్టడంతో బాత్‌రూమ్‌లో తల బాదుకున్న సిరి.. హౌజ్‌ మొత్తం షాక్‌..
అయితే మోనాల్ మాత్రం ఆమెకు మద్దతుగా నిలిచింది. యాని మాస్టర్ జీవితంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి. ఆమె సొంత ఇల్లు కలలు నెరవేర్చుకోవడానికి హౌస్ లో అడుగుపెట్టారు. కాబట్టి ఆమెకు ఓటు వేసి సప్పోర్ట్ చేయాలని వేడుకున్నారు. యాని మాస్టర్ కి మద్దతుగా నిలిచిన మోనాల్ మాటలు, ఆమె పట్ల సానుభూతిని పెంచేవిగా ఉన్నాయి. మరి ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి. ఇక ఈ వారం కెప్టెన్ గా ఉన్న రవి మినహాయించి... మిగిలిన ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నారు.  

Also read Bigg boss telugu5: లీకైన జెస్సీ రెమ్యూనరేషన్ పది వారాలకు ఎంత తీసుకున్నాడంటే!

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?