టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా హీరోయిన్లపై లైంగిక వేధింపుల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మీటూ ఉద్యమాలు జరిగాయి.
యువకుడు చిత్రంతో 2000లో హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఆల్ టైం క్లాసిక్ ఖుషి చిత్రంతో భూమిక పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఒక్కడు, సింహాద్రి చిత్రాలు భూమికని తిరుగులేని హీరోయిన్ గా నిలబెట్టాయి. దీనితో భూమిక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాక.. పవన్, మహేష్, ఎన్టీఆర్ లాంటి హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారింది.
అలాగే Bhumika Chawla మిస్సమ్మ, అనసూయ లాంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా మెరిసింది. వివాహం తర్వాత అనసూయకు సహజంగానే హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం అనసూయ టాలీవుడ్ లో క్యారెక్టర్ రోల్స్ రోల్స్ చేస్తూ బిజీగా గడుపుతోంది.
ఇదిలా ఉండగా భూమిక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లో కూడా హీరోయిన్లపై లైంగిక వేధింపుల గురించి, క్యాస్టింగ్ కౌచ్ గురించి మీటూ ఉద్యమాలు జరిగాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న హీరోయిన్లంతా ధైర్యంగా తమ తమ చేదు అనుభవాలపై మాట్లాడారు.
కానీ భూమిక మాత్రం కాస్టింగ్ కౌచ్ గురించి భిన్నంగా స్పందించడం ఆసక్తిగా మారింది. కమిట్మెంట్ ఇస్తేనే ఆఫర్లు వస్తాయా ? నిర్మాతలతో హీరోయిన్లు టచ్ లో ఉండాలా ? వాళ్ళకు లైంగికంగా హీరోయిన్లు సహకరించాలా ? ఇవన్నీ అసత్య ప్రచారాలు. అసలు క్యాస్టింగ్ కౌచ్ అనేదే అవాస్తవం అన్నట్లుగా భూమిక మాట్లాడడం సంచలనం సృష్టిస్తోంది.
నాకెప్పుడూ అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. కథలో ఆ పాత్రకు నేను మాత్రమే సరిపోతాను అని భావిస్తే నిర్మాతలు, దర్శకులు ముంబైకి వచ్చి మరీ నాతో మాట్లాడతారు. ఆ కథకు నేను సరిపోను అంటే ఇంకొకరిని చూసుకుంటారు. అంతకు మించి కమిట్మెంట్లు, క్యాస్టింగ్ కౌచ్ లు ఉండవు అని భూమిక తెలిపింది.
ప్రస్తుతం భూమిక టాలీవుడ్ లో వదిన, సోదరి తరహా పాత్రలు ఎంచుకుంటోంది. భూమిక చివరగా సీటీమార్ చిత్రంలో గోపీచంద్ కు అక్క పాత్రలో నటించింది.