Bigg boss telugu5: సిరి షన్ను ముద్దులు, కాజల్ గొడవలు, మానస్ కి పింకీ సేవలు, కంటెస్టెంట్స్ తాటతీసిన సుమ

Published : Oct 31, 2021, 07:51 PM ISTUpdated : Oct 31, 2021, 07:53 PM IST
Bigg boss telugu5: సిరి షన్ను ముద్దులు, కాజల్ గొడవలు, మానస్ కి పింకీ సేవలు, కంటెస్టెంట్స్ తాటతీసిన సుమ

సారాంశం

దివాళి స్పెషల్ ఈవెంట్ బిగ్ బాస్ షోలోకి స్టార్ యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ వైఫ్ లేడీ బాస్ ని అంటూ హౌస్ లో సునామి సృష్టించారు. bigg boss telugu 5 కంటెస్టెంట్స్ వైజ్  గా అడగాల్సినవి అడిగి, కడగాల్సినవి కడిగేసి వెళ్లిపోయారు.   

దివాళి స్పెషల్ ఈవెంట్ బిగ్ బాస్ షోలోకి స్టార్ యాంకర్ సుమ ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ వైఫ్ లేడీ బాస్ ని అంటూ హౌస్ లో సునామి సృష్టించారు. bigg boss telugu 5 కంటెస్టెంట్స్ వైజ్  గా అడగాల్సినవి అడిగి, కడగాల్సినవి కడిగేసి వెళ్లిపోయారు. 


షణ్ముఖ్ గురించి మాట్లాడుతూ... అలా నడుస్తూ నడుస్తూ వెళ్లి ఓ సోఫాలో కూలిపోతావ్, ఏంటి రీజన్ అని Anchor suma అడుగగా... ఆ ఏరియాలో రిఫ్రెష్ అవుతానని అన్నాడు. అంటే సోఫాలో కూర్చొని ఛార్జ్ అవుతున్నావా అన్నారు. సిరితో పాటు కలిసి ఇద్దరినీ ఆడుకుంది. షణ్ముఖ్ కి ముద్దులు కూడా పెడుతున్నావ్ అని అడుగగా.. అది నుదుటిపై చిన్నపిల్లలకు పెట్టినట్లు పెట్టాను, అన్నారు. షణ్ణుకి గోరింటాకు లాగా అతుక్కుపోతున్నావ్, అని సుమ కామెంట్ చేయడం జరిగింది. 


ఇక ప్రియాంక ఎప్పుడూ మానస్ చుట్టూ తిరగడాన్ని సుమ లేవనెత్తారు. అతనికి సేవలు చేయడమేనా గేమ్ ఆడేది ఉందా, అని ప్రశ్నించింది. గేమ్ ఈజ్ గేమ్, టైటిల్ గెలిస్తే నాదే అని పింకీ చెప్పింది. హౌస్ లో రవి డల్ అయిపోయాడని సుమ కామెంట్ చేసింది. నువ్వు యాంకర్ వి షార్ప్ గా ఉండాలని చెప్పింది. 


కాజల్ ని ఉద్దేశిస్తూ నీకు గొడవలు చూడడం ఇష్టమా లేక, గొడవలు పెట్టడం ఇష్టమా అని అడుగగా... చూడడం ఇష్టం అని చెప్పింది. చూడాలంటే పెట్టాలిగా అంటూ.. సుమ కౌంటర్ వేసింది. నాకు గొడవపడడం ఇష్టం అంటూ చెప్పింది కాజల్. బయట అన్ని గొడవలు ఉన్నాయి, హౌస్ లో కూడా గొడవలు పడాలా అని సుమ ప్రశ్నించారు. 


జెస్సి ఎప్పుడూ ఒంటరిగా ఉంటావు ఎందుకు అనగా.. రిలేషన్ పెట్టుకోవడనికి ఎవరు లేరు, అందరూ వెళ్లిపోయారని అన్నారు. వెళ్లినవాళ్ళలో ఎవరు ఇష్టం అని అడుగగా... కంటెస్టెంట్స్ హమీదా పేరు చెప్పారు. మానస్ మాములు సమయాల్లో చాలా కూల్ గా కనిపిస్తాడు, టాస్క్ లో మాత్రం ఫైర్ అవుతాడని, లోబో సౌండ్స్ కి మాకు ఇళ్ళలో పిడుగులు పడుతున్నట్లు అనిపిస్తుందని పంచ్ లు విసిరింది.

Also read 30 ఏళ్ల క్రితం అమల రాసిన లవ్ లెటర్ పై నాగ్ కామెంట్..పెళ్లి, ముద్దు అంటూ సిరికి ప్రేమ లేఖ

 
మొత్తంగా హౌస్ లో ఉన్న ఒక్కొక్కరి కథ తేల్చేసిన సుమ. తన మాటల సునామీతో ఎంటర్టైన్ చేసింది. హౌస్ నుండి స్టేజ్ పై ఉన్న నాగార్జున వద్దకు వచ్చిన సుమను, ఆయన టిప్స్ అడిగారు. కంటెస్టెంట్స్ ని ఉద్దేశిస్తూ... అందరూ ముదుర్లే అని, ఎవరి గేమ్ ప్లాన్స్ వాళ్లకు ఉన్నాయంటూ చెప్పి వెళ్ళిపోయింది. 

Also read Balakrishna: తండ్రి స్థాపించిన పార్టీ చంద్రబాబు చేతిలో ఎందుకు పెట్టావ్... బాలయ్య సమాధానం
 

PREV
click me!

Recommended Stories

Mohan Babu చిరంజీవి అన్నదమ్ములుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?
Suma Rajeev Divorce: తల్లిదండ్రుల విడాకుల విషయంలో అసలు జరిగింది ఇదే.. చెప్పేసిన సుమ కొడుకు రోషన్