30 ఏళ్ల క్రితం అమల రాసిన లవ్ లెటర్ పై నాగ్ కామెంట్..పెళ్లి, ముద్దు అంటూ సిరికి ప్రేమ లేఖ

pratap reddy   | Asianet News
Published : Oct 31, 2021, 07:01 PM IST
30 ఏళ్ల క్రితం అమల రాసిన లవ్ లెటర్ పై నాగ్ కామెంట్..పెళ్లి, ముద్దు అంటూ సిరికి ప్రేమ లేఖ

సారాంశం

బిగ్ బాస్ సీజన్ 5లో భాగంగా ఆదివారం రోజు స్పెషల్ ఎపిసోడ్ సాగింది. దీపావళి సందర్భంగా కింగ్ నాగార్జున ఎంటర్టైనింగ్ గేమ్స్.. ఆటపాటలతో ప్రేక్షుకుల ముందుకు వచ్చేశారు. ముందుగా లెటర్ టాస్క్ లో త్యాగం చేసిన వారికి నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు. వారి లెటర్స్ తిరిగి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు.

బిగ్ బాస్ సీజన్ 5లో భాగంగా ఆదివారం రోజు స్పెషల్ ఎపిసోడ్ సాగింది. దీపావళి సందర్భంగా కింగ్ నాగార్జున ఎంటర్టైనింగ్ గేమ్స్.. ఆటపాటలతో ప్రేక్షుకుల ముందుకు వచ్చేశారు. ముందుగా లెటర్ టాస్క్ లో త్యాగం చేసిన వారికి నాగ్ గుడ్ న్యూస్ చెప్పారు. వారి లెటర్స్ తిరిగి ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. రవి, మానస్, సిరి, షణ్ముఖ్, లోబో వారి కుటుంబ సభ్యులు పంపిన లెటర్స్ ని అందుకున్నారు. లెటర్స్ చదువుతూ అంతా ఎమోషనల్ అయ్యారు. సిరి తన ప్రియుడి నుంచి ప్రేమ లేఖ అందుకుంది. ఆ లవ్ లెటర్ లో తిరిగి వచ్చాక తనకు ముద్దు ఇవ్వాలని, పెళ్లి చేసుకోవాలి సిరి బాయ్ ఫ్రెండ్ రాశారు. 

తన ఫ్యామిలీ నుంచి లెటర్ అందుకున్న రవి తొలి సారి కంటతడి పెట్టడం చూస్తాం. తనకు సర్వం తన ఫ్యామిలీనే అని రవి అంటాడు. పెళ్ళికి ముందు ఎలా ఉన్నా పెళ్లి తర్వాత చాలా మారానని.. తన భార్య తనకు బ్యాక్ బోన్ అని రవి ఎమోషనల్ అయ్యాడు. 

సిరి ప్రేమ లేఖపై Nagarjuna ఆసక్తికర కామెంట్స్ చేశారు. మీకు తెలియట్లేదు కానీ.. ప్రేమ లేఖల అనుభవం చాలా బావుంటుంది. నాకు అమల రాసిన లవ్ లెటర్ ని 30 ఏళ్లుగా భద్రంగా దాచుకుని ఉన్నాను అంటూ నాగ్ తెలిపారు. 

ఆ తర్వాత హౌస్ లో చిన్న గేమ్ జరిగింది. నోటిలో స్పూన్.. ఆ స్పూన్ పై స్వీట్ పెట్టుకుని అవతలివైపుకు వెళ్లి పెట్టాలి. అలా గేమ్ ముగిసే సమయానికి ఎవరి వద్ద ఎక్కువ స్వీట్లు ఉంటే వారే విజేత. జెస్సి, రవి జోడి ఈ గేమ్ లో విజయం సాధిస్తారు. ఆ తర్వాత నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరు సేవ్ అవుతారు. శ్రీరామ్, లోబో, షణ్ముఖ్, మానస్ , సిరి, రవి నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. థౌసండ్ వాలా వెలిగించినప్పుడు బాగా శబ్దం వస్తుందో వారు సేఫ్.. తుస్సుమని శబ్దం వస్తే నాట్ సేఫ్.. అలా మానస్ సేవ్ అవుతాడు. 

PREV
click me!

Recommended Stories

Karan Johar: ఆలియా, షారుఖ్ ఖాన్ లని అన్ ఫాలో చేసిన కరణ్ జోహార్.. ఇద్దరితో గొడవలా ?
Ram Charan Peddi: పెద్ది ఎవరి కోసం చూడాలి ? అసలెందుకు చూడాలి ?.. 5 కారణాలు ఇవే