Bigg boss telugu 5:షాకింగ్ న్యూస్... బిగ్ బాస్ హౌస్ నుండి యాంకర్ రవి అవుట్!

Published : Nov 28, 2021, 01:39 PM IST
Bigg boss telugu 5:షాకింగ్ న్యూస్... బిగ్ బాస్ హౌస్ నుండి యాంకర్ రవి అవుట్!

సారాంశం

బిగ్ బాస్ హౌస్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. టైటిల్ ఫేవరేట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి నేడు ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం అందుతుంది.

సెప్టెంబర్ నెలలో మొదలైన బిగ్ సీజన్ 5 (Bigg boss telugu 5) లో 19 మంది సెలబ్రిటీలు ప్రవేశించారు. వీరిలో యాంకర్ రవి టాప్ సెలబ్రిటీ హోదాలో టైటిల్ ఫేవరేట్ గా బరిలో దిగాడు. మిగతా సభ్యులతో పోల్చుకుంటే రవికి బుల్లితెర ప్రేక్షకులలో ఫేమ్ ఎక్కువ. చాలా కాలంగా టాప్ యాంకర్స్ లో ఒకరిగా ఉన్నారు. రవి టైటిల్ గెలుచుకోవడం నల్లేరుపై నడకే అని అందరూ భావించారు. అయితే హౌస్ లోకి వెళ్ళాక పరిణామాలు మారిపోయాయి. అక్కడ పరిస్థితుల కారణంగా రవి బిహేవియర్ ప్రేక్షకులకు నెగిటివ్ గా తోచింది. 


ముఖ్యంగా లహరి (Lahari), ప్రియ వివాదంలో రవి బద్నామ్ అయ్యాడు. హౌస్ లో చాలా మంది సింగిల్ మెన్ ఉండగా.. లహరి నా వెంటే పడుతుందని రవి తనతో చెప్పినట్లు ప్రియ ఓపెన్ గా చెప్పేసింది. నేను ఆ మాట అనలేదని రవి అబద్ధం ఆడాడు. నాగార్జున వీడియో విడుదల చేయగా, ప్రియతో అన్నట్లు రుజువైంది. ముఖ్యంగా ఈ సంఘటన రవి (Anchor Ravi) క్యారెక్టర్ పై నెగిటివ్ ఒపీనియన్ పెరిగేలా చేసింది. ఇక అతడు కన్నింగ్, ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడని కంటెస్టెంట్స్ పలుమార్లు నామినేషన్స్ లో చెప్పారు. 

Also read Bigg Boss Telugu5; సన్నీ టైటిల్‌ విన్నర్.. షణ్ముఖ్‌ ప్లేస్‌ అదే.. కన్ఫమ్‌ చేస్తున్న ప్రిడిక్షన్స్..
దానితో పాటు రవి హౌస్ లో చెప్పుకోదగ్గ ప్రత్యేకత చూపలేకపోయాడు.  టెలివిజన్ ప్రోగ్రామ్స్ లో ఫుల్ ఎనర్జీతో ఉండే రవి, హౌస్ లో మాత్రం డల్ అయ్యాడు. అతడు దాదాపు సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు ప్రేక్షకులు డిసైడ్ అయ్యారు. కారణాలు ఏదైనా నేడు బిగ్ హౌస్ నుండి బయటికి వచ్చేది రవి అని సమాచారం అందుతుంది. సిరి, కాజల్, ప్రియాంక నుండి తక్కువ పోటీ ఎదుర్కొంటున్న రవి... వాళ్ళ కంటే ముందు ఎలిమినేట్ కావడం ఊహించని పరిణామం. టైటిల్ విన్నర్ అవుతాడనుకుంటే ఫైనల్ కి కూడా చేరలేకపోవడం దారుణ వైఫల్యం.  

Also read సన్నీ పక్కా.. సిరి ప్రియుడు రాగానే బిజియంతో మోతెక్కించిన బిగ్ బాస్

PREV
click me!

Recommended Stories

Remuneration: సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకున్న ఒకే ఒక్కడు.. ఆయన ముందు ప్రభాస్, విజయ్‌, అల్లు అర్జున్‌ జుజూబీ
2025లో 8 జంటల సీక్రెట్ లవ్ ఎఫైర్స్ ..లిస్ట్ లో రాంచరణ్, ప్రభాస్, మహేష్ హీరోయిన్లు