మోడీకి సీనియర్‌ నటి రిక్వెస్ట్.. ఎయిర్‌పోర్ట్ బాధలు చెబుతూ ఆవేదన..

By Aithagoni RajuFirst Published Oct 22, 2021, 8:38 AM IST
Highlights

 రోడ్డు ప్రమాదంలో  కాలుని కోల్పోయారు నటి డాన్సర్‌ సుధా చంద్రన్‌. ఆ స్థానంలో కృత్రిమ పాదాన్ని అమర్చుకున్నారు. డాన్సర్‌గానూ కృత్రిమ పాదంతో అనేక షోలను నిర్వహించారు. 

సీనియర్‌ నటి, భరతనాట్య కారిణి సుధా చంద్రన్‌(Sudha Chandran) ప్రధాని మోడీని రిక్వెస్ట్ చేసింది. ఎయిర్‌పోర్ట్ లో అధికారుల వల్ల తమకి ఎదురవుతున్న ఇబ్బందులను చెబుతూ ఆమె నరేంద్ర మోడీ(Narendra Modi)ని ట్యాగ్ చేసింది. తమకు ఓ స్పెషల్‌ కార్డ్ జారీ చేయాలని కోరింది. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని షేర్‌ చేసింది. ఆ వీడియోకి ప్రధాని మోడీని ట్యాగ్‌ చేసింది. మరి ఇంతకి ఏం జరిగిందంటే.. 

నటి, క్లాసికల్‌ డాన్సర్‌ అయిన Sudha Chandran. ఇండియా వైడ్‌గా పాపులర్‌ అయ్యారు. ఆమె తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, బోజ్‌పూరి, మరాఠి ఇలా అనేక ఇండియన్‌ భాషల్లో నటించారు. సినిమాలే కాదు సీరియల్స్ లోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సుధా చంద్రన్‌ నటి మాత్రమే కాదు, మంచి క్లాసికల్‌ డాన్సర్. భరతనాట్యంలో ఆమె దేశ వ్యాప్తంగా అనేక షోలను నిర్వహించారు. అనేక డాన్స్ షోలకు జడ్జ్ గానూ ఉన్నారు. తెలుగులో నృత్య ప్రధానంగా వచ్చిన `మయూరి` చిత్రంతో ఏకంగా జాతీయఅవార్డుని, నంది పురస్కారాన్ని సొంతం చేసుకుంది. 

ఇదిలా ఉంటే ఆ మధ్య రోడ్డు ప్రమాదంలో ఆమె కాలుని కోల్పోయారు. ఆ స్థానంలో కృత్రిమ పాదాన్ని అమర్చుకున్నారు. డాన్సర్‌గానూ కృత్రిమ పాదంతో అనేక షోలను నిర్వహించారు. ఇప్పటికే డాన్స్‌ షోలతోపాటు నటిగానూ రాణిస్తూ బిజీగాఉన్నారు. అయితే కృత్రిమ అవయవం ధరించి ఎయిర్‌పోర్ట్ కి వెళ్లినప్పుడు తమకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయట. చెకింగ్‌ కోసమని ప్రతిసారి ఆ కృత్రిమ పాదాన్ని తీయాల్సి వస్తుందని, అధికారులు ఆ విషయంలో ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలిపింది సుధా చంద్రన్‌. తన పరిస్థితిని ఆమె అధికారులకు వివరించినా ప్రయోజనం లేదని, ప్రతిసారి తీయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది. 

also read: చిరిగిపోయిన అతుకుల డ్రెస్ లో ప్రియమణి హాట్ ఫోజులు.. నెటిజన్లు ఫిదా

ఈ సందర్భంగా ప్రధాని మోడీకి, కేంద్ర ప్రభుత్వానికి ఆమె విజ్ఞప్తి చేస్తుంది. కృత్రిమ అవయవంతో డాన్సు చేసి చరిత్ర సృష్టించిన నేను ఈ దేశం గురించి గర్వపడుతున్నాను.  అయితే నేను నా ప్రొఫేసనల్ విజిట్‌లకు వెళ్లిన ప్రతిసారీ, విమానాశ్రయాల్లోనే నన్ను ఆపేస్తున్నారు. దయజేసి నా కృత్రిమ అవయవం కోసం ఈటీడీ(ఎక్స్ ప్లోసివ్‌ ట్రేస్‌ డిటెక్టీవ్‌) చేయమని సెక్యూరిటీ వద్ద అభ్యర్థించినప్పటికీ వాళ్లు నాన్నుప్రతిసారి ఆ అవయవాన్ని తీసేయాలని  కోరుతున్నారు. ఇది మానవీయంగా సాధ్యమేనా మోడీజీ? ఇదేనా మనం దేశం గురించి మాట్లాడుతోంది. మన సమాజంలో ఒక మహిళ మరొక మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనా? దయజేసి సీనియర్‌ సిటిజన్లకి `సీనియర్‌ సిటిజన్` అని చెప్పే కార్డ్ ఇవ్వండి` అని అభ్యర్థించింది సుధా చంద్రన్‌.

click me!