కౌశల్ ని బయటకి పంపడానికి పెద్ద ప్లానే వేశారు!

By Udayavani DhuliFirst Published 12, Sep 2018, 11:52 AM IST
Highlights

బిగ్ బాస్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు కౌశల్. జనాల్లో అతడికి క్రేజ్ మాములుగా లేదు. సోషల్ మీడియాలో అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది.

బిగ్ బాస్ 2 లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా మారాడు కౌశల్. జనాల్లో అతడికి క్రేజ్ మాములుగా లేదు. సోషల్ మీడియాలో అతడి కోసం కౌశల్ ఆర్మీ పుట్టుకొచ్చింది. అతడి కోసం ఏకంగా 2కె రన్ నిర్వహించింది కౌశల్ ఆర్మీ. బిగ్ బాస్ విన్నర్ కౌశల్ కావాలనేది కౌశల్ ఆర్మీ ఆలోచన. ఆ విధంగా అతడికి అత్యధిక ఓట్లు నమోదయ్యేలా చేస్తున్నారు. కానీ బిగ్ బాస్ కి మాత్రం కౌశల్ కి టైటిల్ ఇచ్చే ఆలోచన లేదని అతడిని ఎలిమినేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్.

తాజా సమాచారం ప్రకారం నిజంగానే ఆయన్ని బయటకి పంపడానికి ప్లాన్ చేస్తోంది బిగ్ బాస్ టీమ్. దీనికోసం అతడితో ఓ గేమ్ ఆడించబోతున్నారు. అదే 'రూలర్ గేమ్'. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌస్ కి కౌశల్ ని రాజుగా ప్రకటిస్తారు. మిగిలిన హౌస్ మేట్స్ ప్రజలు. రాజు ఏం చెప్తే ప్రజలు అది చేయాలి. లేకపోతే కఠినమైన శిక్షలు విధిస్తారు. ఈ గేమ్ ద్వారా కౌశల్ కి ప్రజల్లో క్రేజ్ తగ్గించి ఎలిమినేట్ చేయాలని ఆలోచిస్తున్నారట.

గతంలో హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ గా ఉన్న కొందరిని బయటకి పంపడానికి ఇదే టాస్క్ ని వాడారు. రాజు పెట్టే ఇబ్బందుల కారణంగా మిగిలిన హౌస్ మేట్స్ పై సింపతీ వర్కవుట్ అయ్యేలా ఈ టాస్క్ ఉంటుంది. అన్ని భాషల్లో ఈ టాస్క్ బాగానే వర్కవుట్ అయింది. ఇప్పుడు కౌశల్ కోసం తెలుగులో ఇదే టాస్క్ ని చేపట్టబోతున్నారట. రాజుని బిగ్ బాస్ గైడ్ చేస్తూ ఉంటారు. మరి ఈ టాస్క్ తో కౌశల్ ఎలాంటి రెస్పాన్స్ ని దక్కించుకుంటాడో చూడాలి! 

ఇవి కూడా చదవండి..

బిగ్ బాస్2: కొడుకు పిలుపుతో కౌశల్ కన్నీళ్లు!

బిగ్ బాస్2: కొడుకుని చూసి ఎమోషనల్ అయిన అమిత్

బిగ్ బాస్2: తనీష్ కి దీప్తి భర్త వార్నింగ్!

Last Updated 19, Sep 2018, 9:23 AM IST