బిగ్ బాస్ మానస్ నిశ్చితార్థం,పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర హీరో.. బ్యూటిఫుల్ పిక్స్, వీడియోస్ వైరల్

Published : Sep 02, 2023, 06:18 PM IST
బిగ్ బాస్ మానస్ నిశ్చితార్థం,పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర హీరో.. బ్యూటిఫుల్ పిక్స్, వీడియోస్ వైరల్

సారాంశం

బుల్లితెరపై, సోషల్ మీడియాలో మానస్ క్రేజీ స్టార్ గా మారాడు. టివి సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడూ మ్యూజిక్ వీడియోలు సైతం చేస్తున్నాడు. త్వరలో మానస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా మానస్ నిశ్చితార్థం జరిగింది. 

బిగ్ బాస్ సీజన్ 5 లో మానస్ టాప్ కంటెండర్ గా నిలిచాడు. మెచ్యూరిటీ గేమ్ తో అందరిని ఆకట్టుకున్నాడు. ఇక పింకీ మానస్ వెంటపడడం ఆ సీజన్ లో ఫన్నీగా సాగిన ట్రాక్. అయితే గేమ్ పరంగా మాత్రం మానస్ అందరిని మెప్పించాడు. బిగ్ బాస్ 5 తో మానస్ పాపులారిటీ మరింత పెరిగింది. 

బుల్లితెరపై, సోషల్ మీడియాలో మానస్ క్రేజీ స్టార్ గా మారాడు. టివి సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడూ మ్యూజిక్ వీడియోలు సైతం చేస్తున్నాడు. విష్ణుప్రియాతో కలసి జరీ జరీ పంచె కట్టి అనే సాంగ్ లో మానస్ అద్భుతంగా డ్యాన్స్ చేశాడు. అయితే బుల్లితెరపై మానస్ కి లేడీ ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. వారందరి హార్ట్ బ్రేక్ అయ్యే విధంగా మానస్ లైఫ్ లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నాడు. 

త్వరలో మానస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా మానస్ నిశ్చితార్థం జరిగింది. మానస్ కి కాబోయే భార్య పేరు శ్రీజ నిశ్శంకర్.  తాజాగా జరిగిన నిశ్చితార్థ వేడుకలో ఈ జంట చూడముచ్చటగా ఉన్నారు. చిరునవ్వులు చిందిస్తూ ఇద్దరు పూల మాలలు మార్చుకున్నారు. 

ఇద్దరూ పర్పుల్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్నారు. శ్రీజ నిశ్శంకర్ లెహంగాలో ఎంతో అందంగా ఉంది. ఇద్దరూ చేతిలో చేయి వేసి జంటగా నడుస్తూ ఆకట్టుకుంటున్నారు. వీరి నిశ్చితార్థ వేడుకకి అర్జీ కాజల్, బిగ్ బాస్ విన్నర్ సన్నీ అతిథులుగా హాజరయ్యారు. 

మానస్ నిశ్చితార్థానికి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. ఫ్యాన్స్, నెటిజన్లు మానస్, శ్రీజ జంటకి శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే ఇది పెద్దలు కుదిర్చిన సంబంధం అని తెలుస్తోంది. త్వరలోనే మానస్, శ్రీజ పెళ్లి ముహూర్తం ఖరారు కానుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి