చాలా బావుందండీ 'కుర్చీ మడతపెట్టి'.. గుంటూరు కారం, తమన్ పై బిగ్ బాస్ లహరి ట్రోలింగ్

By tirumala ANFirst Published Jan 12, 2024, 4:35 PM IST
Highlights

బిగ్ బాస్ లహరి సరి తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమన్ మ్యూజిక్ పై సెటైరికల్ కామెంట్స్ చేసింది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో మహేష్  నటించిన హ్యాట్రిక్ మూవీ ఇది. మహేష్ కెరీర్ లో గుంటూరు కారం స్పెషల్ మూవీగా నిలిచిపోవాలని ఫ్యాన్స్ అంతా కోరుకున్నారు.

కానీ థియేటర్స్ నుంచి, క్రిటిక్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే గుంటూరు కారం మూవీ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశ మిగిల్చే చిత్రం అవుతోందని అంటున్నారు. గుంటూరు కారం చిత్రంలో పూర్తిగా త్రివిక్రమ్ మార్క్ మిస్ అయింది అని అంటున్నారు.   

Latest Videos

ఆల్రెడీ ఆన్లైన్ లో త్రివిక్రమ్ పై ట్రోలింగ్ మొదలయింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అజ్ఞాతవాసి లాంటి చేదు జ్ఞాపకాన్ని ఇస్తే మహేష్ ఫ్యాన్స్ కి గురూజీ గుంటూరు కారం చిత్రాన్ని ఇచ్చారు అంటూ ఏకిపారేస్తున్నారు. ఈ మూవీలో తమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకె కానీ పాటలు పెద్దగా వర్కౌట్ కాలేదు. 

బిగ్ బాస్ లహరి సరి తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమన్ మ్యూజిక్ పై సెటైరికల్ కామెంట్స్ చేసింది. దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు అనుకోండి చాలా త్వరగా బోర్ కొట్టేస్తాయి. అందరి ప్లే లిస్ట్ లో అవే ఉంటాయి. వినీ వినీ అలవాటైపోతాయి. కాబట్టి బోర్ అనిపిస్తాయి. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lahari Shari (@lahari_shari)

అదే తమన్ గారి పాటలు అనుకోండి సంవత్సరం క్రితం సాంగ్స్ కూడా ఎంత ఫ్రెష్ గా ఉంటాయో ! ఇప్పుడే వింటున్నట్లు ఉంటాయి. ఎందుకంటే ఒక్క ముక్క కూడా అర్థం కాదు కాబట్టి. వినగానే కొత్తగా కూడా అనిపిస్తుంది ఎందుకంటే ఒక్క ముక్క కూడా గుర్తుండదు కదా! సో.. చాలా బావుందండీ కుర్చీ మడతపెట్టి.. అది తప్పిస్తే ఇంకేమీ గుర్తు లేదు అంటూ  లహరి సరి గుంటూరు కారంపై, తమన్ పై సెటైరికల్ కామెంట్స్ చేసింది. లహరి గుంటూరు కారం మూవీ చూసి అసంతృప్తి తో ఈ కామెంట్స్ చేస్తోందా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. 

 

 

click me!