#GunturKaaram:మహేష్ రెమ్యునరేషన్ ఎంత, పేమెంట్ ఎలా ఇచ్చారంటే...

Published : Jan 12, 2024, 03:13 PM IST
 #GunturKaaram:మహేష్ రెమ్యునరేషన్ ఎంత, పేమెంట్ ఎలా ఇచ్చారంటే...

సారాంశం

భారీ అంచనాలతో వచ్చిన ఈ గుంటూరు కారం ఇటు నవ్విస్తూనే అటు యాక్షన్ తోనూ ఓ వర్గం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. 


రాత్రి ఒంటిగంట నుంచి   ' గుంటూరు కారం' హంగామా మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గుంటూరు కారం  ఘాటెక్కిస్తోంది. ఎన్నో అంచనాలతో వచ్చిన గుంటూరు కారం మూవీకి డివైడ్ టాక్ స్ప్రెడ్ అవుతోంది.  ముఖ్యంగా ఫ్యాన్స్, సినీ లవర్స్ మూవీపై పెదవి విరుస్తున్నారు.  అయితే అదే సమయంలో సంక్రాంతి మూడు రోజులు అడ్వాన్స్ బుక్కింగ్స్ తో కలెక్షన్స్ కు లోటు ఉండదనే భావన వ్యక్తం అవుతోంది. ఈ నేపధ్యంలో అసలు మహేష్ కు ఈ సినిమా నిమిత్తం ఎంత ఇచ్చారు... అనేది మీడియా సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాకు మహేష్ కు అరవై కోట్లు దాకా రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. ఈ మేరకు డిజిటల్ రైట్స్ రాసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ నుంచి 52 కోట్లు పే చెక్ అందుకున్నారని అంటున్నారు. ఇలా డిజిటల్ రైట్స్ తీసుకోవటం వల్ల నిర్మాతపై ప్రొడక్షన్ టైమ్ లో ఆర్దిక భారం పడలేదని అంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో మహేష్ సినిమాకే హైయిస్ట్ డిజిటల్ రైట్స్ పలకాయనేది నిజం. గుంటూరు కారం హిందీ డబ్బింగ్ రైట్స్ సైతం 22 కోట్లుకు వెళ్లిందని తెలుస్తోంది. ఆ విధంగా నిర్మాతకు రికవరీ లభించిందని చెప్తున్నారు. 
  
అలాగే ఈ సినిమాకు మొదటి రోజు  40Cr ఓపినింగ్స్ తెచ్చుకుంటుందని లెక్క వేస్తున్నారు. ఇప్పటికే అడ్వాన్స్ బుక్కింగ్ లతో 20 కోట్ల లెక్క తేలిపోయింది. మరో ఇరవై కోట్లు మిగతా టిక్కెట్ల నుంచి రాబోతున్నాయి. ఇక ఈ సంక్రాంతి  ఫెస్టివల్ మూడు రోజుల్లోనూ 80Cr వరకూ వస్తాయని లెక్క వేస్తున్నారు. సినిమాకు ఓ మాదిరి టాక్ వస్తేనే ఈ లెక్కలు అని, ఇక టాక్ అదిరిపోతే ఇంక ఈలెక్కలు పనికిరావని చెప్తున్నారు. అయితే ఈ ట్రేడ్ లెక్కలు ఏ మేరకు నిజం అవుతాయనేది మరో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోతుంది.  
   

PREV
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌