RRR: `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి షాకిచ్చిన అభిమానులు.. మీడియాకి రాజమౌళి క్షమాపణలు..

By Aithagoni Raju  |  First Published Dec 9, 2021, 10:11 PM IST

`ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి షాకిచ్చారు అభిమానులు. టాలీవుడ్‌ ఫిల్మ్ మీడియాకి సంబంధించి ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌ వద్దకి భారీగా అభిమానులు తరలిరావడంతో ప్రెస్‌మీట్‌ క్యాన్సిల్‌ చేశారు. దీంతో మీడియాకి రాజమౌళి క్షమాపణలు చెప్పారు.


`ఆర్‌ఆర్‌ఆర్‌`(RRR Trailer) ట్రైలర్‌ ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఓ ఊపు ఊపేస్తుంది. మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. మొదటగా ట్రైలర్‌ని థియేటర్‌లోనే విడుదల చేసిన విసయం తెలిసిందే. థియేటర్‌లో ట్రైలర్‌ చూసి అభిమానులు హోరెత్తిపోయారు. దీంతో థియేటర్లు మోత మోగిపోయాయి. ట్రైలర్‌ మైండ్ బ్లోయింగ్‌ అని అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పుడిది ట్రెండ్‌ అవుతుంది. ఈ నేపథ్యంలో మార్నింగ్‌ ముంబయిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు `ఆర్‌ఆర్‌ఆర్`(RRR Movie) టీమ్‌. రాజమౌళి, ఎన్టీఆర్‌, అజయ్‌ దేవగన్‌, అలియాభట్‌, డివివి దానయ్య పాల్గొన్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్‌ మీడియాతోనూ ముచ్చటించేందుకు RRR టీమ్‌ సిద్ధమయ్యింది. మధ్యాహ్నం ఫిల్మ్ మీడియాకి సమాచారం అందించారు. సాయంత్రం హైదరాబాద్‌లోని pvr సినీ మ్యాక్స్ లో ప్రెస్‌మీట్‌ ప్లాన్‌ చేశారు. ఇందులో టోటల్‌ టీమ్‌ పాల్గొంటుందని పేర్కొన్నారు. అయితే అనుకున్న టైమ్‌ కంటే ముందే మీడియా అక్కడికి చేరింది. దాదాపు రెండు గంటలపాటు వెయిట్‌ చేసింది. అయితే ఈ ప్రెస్‌ మీట్‌ వార్త లీక్‌ కావడంతో భారీగా అక్కడికి అభిమానులు తరలి వచ్చారు. హీరోలు ప్రెస్‌ మీట్‌ వేదిక లోపలికి రాలేని విధంగా భారీగా ఫ్యాన్స్ పోటెత్తడంతో `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌ షాక్‌కి గురయ్యింది. 

Latest Videos

దీంతో ప్రెస్‌మీట్‌ని క్యాన్సిల్ చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ రావడానికి కష్టమైన నేపథ్యంలో ప్రెస్‌మీట్‌ క్యాన్సిల్‌ చేస్తున్నట్టు రాజమౌళి(Rajamouli) మీడియాకి వెళ్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకి క్షమాపణలు చెప్పారు. అభిమానులు భారీగా తరలిరావడంతో హీరోలు లోపలికి రాలేకపోతున్నారని, దీంతో ప్రెస్‌మీట్‌ని వాయిదా వేస్తున్నట్టు చెప్పారు Rajamouli. మరో రెండు మూడు రోజుల్లో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో మీడియా సమావేశం ఏర్పాటు చేస్తామని, కేవలం మీడియాకి మాత్రమే ఆ మీట్‌ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మిస్‌ కమ్యూనికేషన్‌కిగానూ రాజమౌళి మరోసారి క్షమాపణలు తెలియజేశారు. 

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్నారు. రామ్‌చరణ్‌కి జోడీగా బాలీవుడ్‌ నటి అలియాభట్‌, ఎన్టీఆర్ కి జోడీగా ఒలివియా మోర్రీస్‌ నటిస్తున్నారు. అజయ్‌ దేవగన్‌, సముద్రఖని, శ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ డానయ్య ఏకంగా ఐదు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమాని నిర్మించారు. ఈ సినిమా జనవరి 7న సంక్రాంతి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా పదికిపైగా భాషల్లో విడుదల కానుంది. 

also read: RRR Trailer: పప్పులో కాలేయబోయిన రాజమౌళి.. తప్పు తెలుసుకుని వెనక్కి తగ్గిన జక్కన్న

click me!