అర్చన విషయంలో ఎన్టీఆర్ చెప్పిందే నిజమైంది..!

Published : Sep 23, 2017, 04:59 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
అర్చన విషయంలో ఎన్టీఆర్ చెప్పిందే నిజమైంది..!

సారాంశం

చివరి దశకు చేరుకున్న బిగ్ బాస్ షో బిగ్ బాస్ హౌస్ లో ఫైనల్స్ కి చేరిన అర్చన అర్చనకు మద్దతుగా ఫ్లెక్సీలు

హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసి.. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా అవకాశాలు అందుకున్న తెలుగమ్మాయి అర్చన. ఆ తర్వాత.. ఆ అవకాశాలు కూడా తగ్గిపోయాయి.. ఆమెను అందరూ మర్చిపోయారు అనుకున్న తరుణంలో అర్చనకు బిగ్ బాస్ లో అవకాశం వచ్చింది. తెలుగు బుల్లితెరపై తొలిసారిగా టెలికాస్ట్ అయిన ఈ బిగ్ బాస్ రియాల్టీ షోకి ఎన్టీఆర్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు.

 

చాలా సార్లు ఇంటిసభ్యులు అర్చనను నామినేట్ చేసినా.. ఆమె మాత్రం ప్రేక్షకుల ఓట్లతో బిగ్ బాస్  ఫైనల్స్ కి చేరుకున్నారు. ప్రస్తుతం చివరి అంకానికి చేరుకున్న ఈ బిగ్ బాస్ షోలో ఒక ఎపిసోడ్ లో.. హైదరబాద్ నగరంలోని అమీర్ పేటలో అర్చన కోసం అభిమానులు  ఫ్లెక్సీ కట్టారు అంటూ ఎన్టీఆర్ సరదాగా అన్నారు. తారక్ సరదాగా అన్న మాటలను అర్చన నిజంగానే నమ్మేసింది. కానీ.. ఇప్పుడు అదే నిజమైంది.

 

అర్చన కు ఓటు వేయండి అంటూ.. కొందరు నగరంలోని పలు చోట్ల ఆమె ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీ పైన జై లవ కుశ చిత్ర పోస్టర్ కూడా కనపడుతోంది. దీంతో ఎన్టీఆర్ అభిమానులే అర్చన ఫ్లెక్సీ  ఏర్పాటు చేసినట్లు అర్థమౌతోంది.

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం