
బిగ్‌బాస్ తెలుగు 5 (Bigg Boss Telugu 5)తొమ్మిదో వారం 59వ(58వ రోజు) ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. నామినేట్ అయిన సభ్యుల్లో ఒకరిని సేవ్ చేయడంతోపాటు మరోకరు సేవ్‌చేసే సీక్రెట్ పవర్‌ని బయటకు తీసుకొచ్చాడు. ఇంటి సభ్యులను ఆశ్చర్యంతోపాటు ఆనందానికి గురి చేశాడు. ఇక 58వ రోజు ప్రారంభంలో.. నామినేషన్‌కి సంబంధించి డిస్కషన్ కంటిన్యూ అయ్యింది. ఇందులో మానస్, సన్నీ మధ్య జెస్సీ గురించి చర్చ వచ్చింది. జెస్సీ వామ్టింగ్ చేసుకున్నప్పుడు అతని ఫ్రెండ్స్ పట్టించుకోలేదు. కానీ నేను అలా చూస్తు ఊరుకోలేను అని చెప్పారు సన్నీ. తాను హెల్ప్ చేసిన విషయాన్ని చెప్పాడు. దీనికి మానస్ స్పందిస్తూ, వాళ్ల మధ్య అండర్‌స్టాండింగ్ బాగానే ఉంది. నువ్వే అతిగా ఫీలవుతున్నావని చెప్పాడు.
మరోవైపు అనీ మాస్టర్, రవి, శ్రీరామ్‌ల మధ్య సన్నీ మ్యాటర్ చర్చకు వచ్చింది. సన్నీ ఏం మాట్లాడుతాడో అర్థం కాదు. కానీ అతని మనసు మాత్రంక్లీయర్. కాకపోతే ఆవేశంలో ఏదో మాట్లాడేస్తుంటాడని చెబుతుంది. దీనికి రవి రియాక్ట్ అవుతూ.. సన్నీకి మెల్లగా చెప్పాలి. అర్థం చేసుకుంటాడు. అయితే చెప్పేది వినడు. మనం మాట్లాడేదాంట్లో ఒక్క పాయింట్‌నే పట్టుకుని వాదిస్తుంటాడు. అరుస్తాడని తెలిపారు. అయితే సన్నీ ఏం మాట్లాడుతాడో అర్థమేకాదని చెబుతాడు రవి. కాజల్ విషయాన్ని తీస్తూ ఆమె చాలా కన్నింగ్. నాగ్ సర్ స్నేక్ ఇచ్చాడు. ఆమె మాట్లాడుతూ కాటేస్తుందని అంటాడు.
మరోవైపు ప్రియాంక విషయం తీస్తూ.. ఆమె ఎవరినైనా నామినేట్ చేయోచ్చు. కానీ తనని మాత్రం ఎవరు నామినేట్ చేసినా తట్టుకోలేదంటాడు రవి. దీనికి కెప్టెన్ షణ్ముఖ్ రియాక్ట్ అవుతూ, అదే విషయాన్ని నేను నామినేషన్‌లో చెప్పాను. ఆమె మానస్‌తో కలిసి ఆడుతుంది. ఇకపై నువ్వు నీ గేమ్ ఆడు, సొంతంగా ఆడమని చెప్పానని తెలిపాడు. సన్నీ గురించి చెబుతూ, సన్నీ గతంలో హైపర్ అయితే పక్కన స్వేత,హమీద ఉండి కంట్రోల్ చేసేవాళ్లు. ఇప్పుడు వాళ్లు లేరు. ఆయన్ని కంట్రోల్ చేసేవాళ్లు లేరు. దీంతో రెచ్చిపోతున్నాడని అంటాడు షణ్ముఖ్. అయితే సన్నీ ఆవేశంలో ఏం మాట్లాడతాడో తనకే తెలియదని అతని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశాడు.
అనంతరం నామినేషన్‌లో ఉన్న వారికి ఓ ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. `జీవితమే ఒక ఆట` పేరుతో ఇచ్చిన టాస్క్ లో చివరికి మిగిలిన ఒకరు నామినేషన్ నుంచి సేవ్ అవుతారని తెలిపారు. ఇందులో భాగంగా గ్యారేజ్‌లో ఉన్న నామినేషన్‌లో ఉన్న ప్రతి ఒక్కరి ఫోటోతో బ్యాగులుంటాయి. బిగ్‌బాస్ బజర్ మోగగానే వాళ్లు ఫాస్ట్ గా పరిగెత్తి ఇతరుల బ్యాగ్‌లను తీసుకుని, గార్డెన్‌లో ఉన్న కంచె రూమ్ లోకి వెళ్లాల్సి ఉంటుంది. చివరగా వెళ్లినవాళ్లు, వాళ్లు పట్టుకున్న బ్యాగ్‌పై ఉన్న ఫోటో గల వారు అర్హులు కారు, వారిలో ఒకరిని ముందుగా వెళ్లిన ఇతర సభ్యులు ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది.
ఈ గేమ్‌లో భాగంగా మొదటి రౌండ్‌లో కాజల్ బ్యాగ్ పట్టుకున్న శ్రీరామ్‌లలో కాజల్‌ని ఎలిమినేట్ చేశారు. రెండో రౌండ్‌లో.. జెస్సీ, సన్నీ ఉన్నారు. సన్నీది పట్టుకున్నజెస్సీ చివర్లో రావడం వీరిద్దరు బయటే ఉండగా, వీరిలో సన్నీని ఎలిమినేట్ చేశారు. మూడో రౌండ్‌లో సిరి, జెస్సీలు ఉండగా, జెస్సీ ఎలిమినేట్ చేశారు. నాల్గో రౌండ్‌లో శ్రీరామ్, విశ్వ ఉండగా, విశ్వ ఎలిమినేట్ అయ్యారు. ఐదో రౌండ్‌లో రవి, సిరి ఉండగా, సిరి ఎలిమినేట్ అయ్యింది. ఆరో రౌండ్‌లో రవి, మానస్ ఉండగా, రవి ఎలిమినేట్ అయ్యాడు. ఏడో రౌండ్‌లో మానస్, శ్రీరామ్ ఉండగా, మానస్ ఎలిమినేట్ అయ్యారు. చివరగా, అనీమాస్టర్,శ్రీరామ్ మిగిలిపోయారు. వీరిలో అనీ మాస్టర్ని సేవ్ చేశారు. ఇంటి సభ్యులు. శ్రీరామ్ ఎలిమినేట్ అయ్యాడు.
దీంతో తొమ్మిదో వారంలో అనీ మాస్టర్ నామినేషన్ల నుంచి సేవ్ అయ్యారు. అయితే ఈ సమయంలో అసలైన ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. గతంలో ఓ సారి అనీ మాస్టర్ కి లభించిన పవర్‌ని ఉపయోగించుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో అనీమాస్టర్ తన వద్ద ఉన్న పవర్ని ఉపయోగించి నామినేషన్‌లో ఉన్న ఒకరిని సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ టాస్క్ లో అనీ మాస్టర్ మానస్ని సేవ్ చేసింది. దీంతో శ్రీరామ్ నామినేషన్‌లోనే ఉండిపోయాడు.
ఫైనల్‌గా తొమ్మిదో వారం నామనేషన్లని ప్రకటించాడు బిగ్‌బాస్. అనీ మాస్టర్, ఆమె సేవ్ చేసిన మానస్ మినహా శ్రీరామ్, సన్నీ, విశ్వ, సిరి, కాజల్, జెస్సీ, రవి, ప్రియాంక ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ విషయాన్ని బిగ్‌బాస్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ టాస్క్ లో మధ్యలో సన్నీ తాగుబోతుగా మారాడు. గేమ్ లో ఉన్న అనీ మాస్టర్, శ్రీరామ్,ప్రియాంకలతో తాగుబోతులా మాట్లాడారు. కాసేపు నవ్వులు పూయించారు. తనలోని కామెడీ యాంగిల్‌ని బయటకు తీసి ఆకట్టుకున్నాడు.
also read: స్టయిల్ కా బాప్ అంటోన్న రకుల్ ప్రీత్ సింగ్.. ప్రియుడు వచ్చాక జోరు మామూలుగా లేదుగా..