Balakrishna Hospitalised: ఆసుపత్రిలో చేరిన బాలకృష్ణ.. భుజానికి ఆపరేషన్‌..

Published : Nov 02, 2021, 05:44 PM ISTUpdated : Nov 02, 2021, 05:48 PM IST
Balakrishna Hospitalised: ఆసుపత్రిలో చేరిన బాలకృష్ణ.. భుజానికి ఆపరేషన్‌..

సారాంశం

 కేర్‌ ఆసుపత్రి వైద్యుల బృందం సమక్షంలో ఈ ఆపరేషన్‌ జరిగిందని వైద్యులు తెలిపారు. బాలకృష్ణ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆసుపత్రిలో చేరారు. ఆయన హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రి(Care Hospital)లో జాయిన్‌ అయ్యారు. కుడి భుజం నొప్పి తీవ్రం కావడంతో ఆయన సోమవారం ఆసుపత్రిలో చేరారు.  దాదాపు నాలుగు గంటల పాటు బాలయ్యకి ఆపరేషన్‌ నిర్వహించారట. కేర్‌ ఆసుపత్రి వైద్యుల బృందం సమక్షంలో ఈ ఆపరేషన్‌ జరిగిందని వైద్యులు తెలిపారు. బాలకృష్ణ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆయన ఆరోగ్యం బాగానే ఉందని వైద్యులు తెలిపారు.

సోమవారం డాక్టర్‌ రఘువీర్‌ రెడ్డి ఆధ్వర్యంలో బాలకృష్ణకి ఆపరేషన్‌ నిర్వహించారట. ఈ రోజు సాయంత్రం ఆయన్ని డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. అయితే దాదాపు ఆరు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. అయితే బాలకృష్ణ ఆరోగ్యం విషయంలో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆందోళ చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలపడం విశేషం.

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం `అఖండ`(Akhanda) చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన రెండు విభిన్న పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్‌, ఫస్ట్ రోర్‌ వంటి వాటికి మంచి స్పందన లభించింది. మిలియన్‌ వ్యూస్‌ని రాబట్టుకున్నాయి. త్వరలో సినిమాకి సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలను వెల్లడి కాబోతున్నాయి. ఈ సినిమాకి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌కాబోతుంది.

మరోవైపు బాలకృష్ణ `అన్‌స్టాపబుల్‌`(Unstoppable) అనే టాక్‌ షోకి హోస్ట్ గా చేస్తున్నారు బాలకృష్ణ. ఆహాలో ఇది ప్రసారం కాబోతుంది. దీపావళి కానుకగా ఈ నెల 4న నుంచి ఈ టాక్‌ షో ప్రసారం కానుంది. ఇందులో మొదటగా మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ పాల్గొన్నారు. ఇటీవల `మా`(మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌) ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే.

also read: ‘అఖండ’ కొత్త రిలీజ్ డేట్ ఖరారు,ఈ వారంలో ప్రకటన

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే