పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడు.. నెక్ట్స్ ప్లానేంటి?

Published : Dec 24, 2023, 09:47 PM ISTUpdated : Dec 24, 2023, 10:34 PM IST
పల్లవి ప్రశాంత్‌ ఇప్పుడు ఏం చేస్తున్నాడు.. నెక్ట్స్ ప్లానేంటి?

సారాంశం

`బిగ్‌ బాస్‌ తెలుగు 7 ` విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ వివాదాలకు కేరాఫ్‌గా నిలిచారు. ఏకంగా జైలుకు వెళ్లి వచ్చాడు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు. 

`బిగ్‌ బాస్‌ 7` షో ఈ సారి చాలా కాంట్రవర్సీకి కేరాఫ్‌గా నిలిచింది. గ్రాండ్‌ ఫినాలే వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా షో నడిచింది. కానీ ఫినాలే రోజు మొత్తం లెక్కలు మారిపోయాయి. బిగ్‌ బాస్‌ తెలుగు 7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ అభిమానులు చేసిన హంగామా వివాదాలకు కారణమైంది. పలువురు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కార్లని ధ్వంసం చేయడం పెద్ద వివాదంగా మారింది. దీనికితోడు ఆర్టీసీ బసు అద్దాలను కూడా ధ్వంసం చేశారు. 

అయితే ఇదంతా పల్లవి ప్రశాంత్‌ వల్లే జరిగిందని, అతను బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఆదేశాలను, పోలీసుల ఆదేశాలను కాదని అభిమానులతో, మెయింట్‌ గేట్‌ నుంచి బయటకు రావడమే దీనంతటికి కారణమైందని పోలీసులు భావించారు. ఆయనపై కేసు నమోదు చేశారు. దాదాపు తొమ్మిది కేసులు పెట్టారు. బెయిల్‌ రాకుండా చేశారు. ఏకంగా జైలుకి కూడా పంపించారు. కానీ ఎట్టకేలకు ప్రశాంత్‌కి బెయిల్‌ వచ్చింది. జైలు నుంచి వచ్చిన ప్రశాంత్‌ ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యాడు. 

ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్‌ తాజాగా భోలే ఇచ్చిన పార్టీకి హాజరయ్యాడు. బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్లకి ఆయన చిన్న గెట్‌ టూ గెదర్‌ పార్టీ నిర్వహించారు. ఇందులో శివాజీ, ప్రశాంత్‌ కూడా హాజరయ్యారు. వీరితోపాటు మరికొందరు కంటెస్టెంట్లు ఇందులో పాల్గొన్నారు. అయితే ప్రశాంత్‌ మాత్రం ఇకపై మీడియా ముందుకు రాదలుచుకోలేదట. మీడియాకి, పబ్లిక్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నాడట. పూర్తిగా వ్యక్తిగత లైఫ్‌కే ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నాడట. బిగ్‌ బాస్‌ వల్ల వచ్చిన ఫేమ్‌ కోసం ఆయన బయట అవకాశాల కోసం, ఇతర వాటికి ప్రయారిటీ ఇవ్వాలని అనుకోవడం లేదని, తాను వివాదాల కారణంగా బాగా అలసిపోయిన నేపథ్యంలో కొన్ని రోజులు అన్నింటికి దూరంగా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. 

మీడియాకి, తన అభిమానులను కలిసేందుకు కూడా ఆయన మొగ్గు చూపడం లేదు. ఫ్యాన్స్ ని కలిసే కార్యక్రమాలను కూడా రద్దు చేసుకున్నారట. కొన్ని రోజులు  పూర్తిగా రిలాక్స్ అవ్వాలనుకుంటున్నాడట. దీంతోపాటు తన వ్యవసాయం పనులు చూసుకుంటూ, పూర్తిగా ఫ్యామిలీకే టైమ్‌ కేటాయించాలని భావిస్తున్నారట. ఈ వేడి అంతా తగ్గిపోయేంత వరకు బయటకు రాకుండా ఉండాలనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత తన భవిష్యత్‌ కార్యక్రమాలపై ఫోకస్‌ పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.  

మామూలుగా అయితే, ఎలాంటి వివాదాలు లేకపోయి ఉంటే, బిగ్‌ బాస్‌ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ హంగామా వేరే ఉండేది. ఆయనకు సినిమా ఆఫర్లు, ఇతర కమర్షియల్‌ ఆఫర్లు వచ్చేవి. ఫుల్‌ బిజీగా ఉండేవాడు. వరుస ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆయన ఇమేజ్‌ మరింత పెరిగిపోయేది. ఒక లాంటి స్టార్‌ డమ్ ని ఆయన ఎంజాయ్‌ చేసేవారు. బిగ్‌ బాస్ విన్నర్‌గా ఆ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేసేవాడు. కానీ అనూహ్య వివాదాలు ఆయన్ని చుట్టముట్టడంతో ఆ సంతోషం కాసేపు లేకుండా చేసింది. ఓ సాధారణ ఫ్యామిలీకి లేనిపోని చిక్కులు వచ్చిపడ్డాయి. ఇది నిజంగా దురదృష్టకరం. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌