
ఈమధ్య సినిమాలు హిట్ అవ్వడంతో పాటల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది.ఆడియో హిట్ అయినా.. సినిమాలు ప్లాప్అయిన సందర్భాలు కూడా ఉన్నాయనుకోండి. అయితే సినిమాలు హిట్ అయిన తరువాత పాటలు పాపులర్ అయినసందర్భాలు కూడా లేకపోలేదు. ఈక్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి.. దేశ వ్యాప్తంగా ఊపు ఊపేసిన సినిమాయానిమల్. ఈసినిమాలో ఓ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా వినిపిస్తోంది. వినిపించడం కాదు రచ్చ రచ్చ చేస్తోంది. అయితే ఇది మాత్రం తెలుగు పాట కాదు. ఇంతకీ ఆ పాట ఏ భాషలోనిది.. ? దాని అర్ధం ఏంటి..?
బాలీవుడ్ హీరో రణ్ బీర్ కపూర్... టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగ కాంబోలో వచ్చిన సినిమా యానిమల్.. రచ్చ రచ్చ సన్నివేశాలతో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది సినిమా. అంతే కాదు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. రణ్ బీర్ కపూర్ కెరియర్ లోనే యానిమల్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి సినిమాను మించి యానిమల్ సినిమాతో సత్తా చాటాడు సందీప్. ఇక డిసెంబర్ 1 న రిలీజైన ఈ సినిమాలో హింస, బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉందంటూ విమర్శలు వచ్చాయి. అయినా జనం చూడటం మానడం లేదు. బాగా ఆదరిస్తున్నారు.
ఇక ఈసినిమాలో ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్న విషయం మానిమల్ సాంగ్. అవును ఈసినిమాలో అర్ధం కాని భాషలో ఓ పాట అందరిని ఆకర్శిస్తోంది. ఈ పాట మ్యూజిక్..ట్యూన్ అందరిని సమ్మోహనపరుస్తోంది. దాంతో ప్రస్తుతం దేవ వ్యాప్తంగా ట్రెండింగ్ అవ్వడంతో పాటు..రీల్స్.. రింగ్ టోన్స్ లో కూడా మారు మోగిపోతోంది. ఇక సోషల్ మీడియాలో దడదడలాస్తున్న జమాల్ కుడు.. యూట్యూబ్ లో దుమ్ము రేపింది. మ్యూజిక్ తప్పించి.. లిరిక్ అర్ధం కాని ఈ పాటకు అసలు అర్ధమేంటో తెలుసా?
యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన బాబీ డియోల్ ఎంట్రీలో జమాల్ కుడు సాంగ్ వస్తుంది. మంచి రిధమ్ తో పాటు.. కాలు ఆటోమెటిక్ గా కదిపేట్టు పాట్ ఆకర్షిస్తుంది. అయితే ఈ పాటలో ‘జమాల్ జమలేక్ జమాలు జమల్ కుడు’ అనే పదాలు వినిపిస్తాయి. ఈ పాట నిజానికి 1950 లలోని ఇరానియన్ సాంగ్ అట. ఈ పదాలకు ‘ఓ నా ప్రేమ.. ప్రియమైన.. నా మధురమైన ప్రేమ’ అని అర్ధమట. ఓల్డ్ ఇరానియన్ పాటను సందీప్ వంగ ఫ్రెష్ మ్యూజిక్ తో రీక్రియేట్ చేయించారట. అది కాస్త జనాల్లోకి దూసుకుపోయింది.