
వరుస సినిమాలు.. వరుస హిట్లదో దూసుకుపోతూ..కుర్ర హీరోలకు కూడా హడల్ ఎత్తిస్తున్నాడు నందమూరినటసింహం బాలయ్య బాబు. ఇప్పటికే వరుసగా హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య.. డబుల్ హ్యాట్రిక్ ఫ్లానింగ్ లో ఉన్నాడు. అందులో భాగంగానే మెగా దర్శకుడు బాబీతో ఓ సినిమా చేస్తేన్నాడు నటసింహం. ఈమూవీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్నట్టుతెలుస్తోంది.
అంతే కాదు ఈ సినిమా ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ గా తెరకెక్కుతోంది. రీసెంట్ గా వచ్చిన బాలయ్య సినిమాలో కూతురు సెంటిమెంట్ అంద్భుతంగా పండింది. ఇక ఇప్పుడు బాబీ సినిమాలో కొడుకు సెంటిమెంట్ ప్రధానంగా సినిమా తెరకెక్కుతుందట. అంతే కాదు తండ్రీ కొడుకుల నేపథ్యంలో తెరకెక్కే ఈ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామాలోని ఫ్లాష్ బ్యాక్ పై ఇప్పుడు ఓ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య – బాలయ్య కొడుకు పాత్రల మధ్య ఎమోషన్స్ చాలా బాగుంటాయని వినికిడి.
అంతే కాదు.. పక్కా ఫ్యామిలీ సెంటిమెంట్ తో ఈమూవీ నడుస్తుందని అంటున్నారు. అలాగే ఈ సినిమా క్లైమాక్స్ ను డిఫరెంట్ గా డిజౌన్ చేస్తున్నారట. అది కూడా ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేసే విధంగా చేస్తున్నట్టు అంటున్నారు. ఇక ఈ సినిమాలోని యాక్షన్ ను ప్రముఖంగా చెప్పుకునేవిధంగా ఉంటుందట. బాలయ్య అంటేనే యాక్షన్.. యాక్షన్ అంటేను బాలయ్య..అటువంటింది బాలయ్య సినిమాలో యాక్షన్ సీనస్ ఏవిందంగా డిజైన్ చేయాలో వారికిప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ సినిమా బాలయ్య టైపు ఫక్తు యాక్షన్ డ్రామా కాదు అని.. ఇదొక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ తో సాగే ఎమోషనల్ డ్రామా అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. కాగా ఈ సినిమాలో పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందట. అన్నట్టు ఈ సినిమాలో కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ నాగవంశీ నిర్మిస్తున్నారు.