బిగ్ బాస్: ప్రత్యర్థులను కుక్కలతో పోల్చాడు..

sivanagaprasad kodati |  
Published : Sep 26, 2018, 10:01 AM IST
బిగ్ బాస్: ప్రత్యర్థులను కుక్కలతో పోల్చాడు..

సారాంశం

హిందీ బిగ్ బాస్ ఎంతగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో సీజన్ 12 నడుస్తోంది. ఇందులో విచిత్ర జోడీస్ అనే కాన్సెప్ట్ తో షోని నడిపిస్తున్నారు. 

హిందీ బిగ్ బాస్ ఎంతగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు బాలీవుడ్ లో సీజన్ 12 నడుస్తోంది. ఇందులో విచిత్ర జోడీస్ అనే కాన్సెప్ట్ తో షోని నడిపిస్తున్నారు. ఈ షోలో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాడు.

షో మొదలైనప్పటి నుండి కూడా శ్రీశాంత్ టాస్క్ కి సంబంధించి వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు. ఇటీవల హౌస్ నుండి వెళ్లిపోతానని హెచ్చరించిన శ్రీశాంత్ తోటి కంటెస్టెంట్ ని కుక్కలతో పోల్చి మరోసారి వార్తల్లో నిలిచాడు. సముద్రంలో ఆత్మరక్షణ టాస్క్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు ఒకరినొకరు నిందించుకునే వరకు వెళ్లింది.

సింగిల్స్ లో ఒక కంటెస్టెంట్ కుర్చీ మీద కూర్చుంటారు. వారు ప్రత్యర్థిని లొంగిపోయేవిధంగా టార్చర్ చేస్తుంటారు. ఈ క్రమంలో శ్రీశాంత్ ని తన ప్రత్యర్థి సరెండర్ చేసుకోవడానికి కొన్ని వ్యాఖ్యలు చేస్తుండగా ఆ ఆసమయంలో శ్రీశాంత్ సహనం కోల్పోయి వారిని కుక్కలతో పోల్చాడు.

ఈ లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కరణ్ వీర్ బోహ్రా తన టాస్క్ ని విజయవంతగా పూర్తి చేశారు. ఈ టాస్క్ లో పాల్గొన్న కంటెస్టెంట్లు తమ ప్రత్యర్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో క్రికెటర్ శ్రీశాంత్ ఎమోషనల్ అయ్యారు. తన ఫ్యామిలీని గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు.

PREV
click me!

Recommended Stories

Kajal Aggarwal: బాత్‌ రూమ్‌ని కూడా వదలని కాజల్‌.. బ్లాక్‌ డ్రెస్‌లో ఇలా చూస్తే ఇక అంతే
kalyan padala love story: నా కంటే వాడు బెటర్‌గా ఉన్నాడని వెళ్లిపోయింది.. కళ్యాణ్‌ క్రేజీ లవ్‌ స్టోరీ, ఎంత మోసం చేసింది