పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రం Project K. తెలుగు ఆడియెన్స్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా బిగ్ అప్డేట్ అందించారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) - నాగ్ అశ్విన్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కే’. చిత్రం అనౌన్స్ నుంచే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైథో - సైఫై అండ్ భారీ యాక్షన్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. పాన్ వరల్డ్ స్థాయిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూ.500 కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ వండర్ ను నిర్మిస్తున్నారు.
చాలా కాలంగా ఈ చిత్రం సాలిడ్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. కానీ మేకర్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ పోస్టర్లను, చిత్రంలోని స్టార్ కాస్ట్ ఫస్ట్ లుక్ పోస్టర్లను వదులుతూ సినిమాపై హైప్ పెంచుతూ వచ్చాయి. ఇక ఎప్పుడెప్పుడు గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ వస్తుందా? అని ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో మేకర్స్ నుంచి బిగ్ అనౌన్స్ మెంట్ అందింది. ఈరోజే అప్డేట్ రానుందని ప్రకటించారు.
అయితే, ‘ప్రాజెక్ట్ కే’ అనే టైటిల్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం తెలిసిందే. కానీ ఇందుకు ‘కే’ అంటే ఏంటనేది ఎవరికీ అంతుపట్టని రహస్యంగా మారింది. దీనిపై చాలా వార్తలు కూడా వినిపించాయి. ఇక ఎట్టకేళలకు మేకర్స్ ‘ప్రాజెక్ట్ కే’ అంటే ఏంటో చెప్పబోతున్నట్టు తాజాగా అధికారికంగా అనౌన్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 7:10 నిమిషాలకు ఫస్ట్ అప్డేట్ గా అందబోతున్నట్టు తెలిపారు.
నాగ్ అశ్విన్ చిత్రాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంతో ప్రపంచం చూపు ఇండియా వైపు తిరిగేలా చేస్తారంటున్నారు. ఇప్పటి వరకున్న రికార్డులన్నీ బ్రేక్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక రిలీజ్ కు ముందే ఈ చిత్రం అరుదైన ఘనతను సాధించింది. అమెరికాలోని కాలిఫోర్నియాలోని సాన్ డైగో కామిన్ కాన్ ఈవెంట్ లో ఈ సినిమా పాల్గొనబోతున్నట్టు తెలిపారు. ఆ సమయంలోనే ‘ప్రాజెక్ట్ కే’ గ్లింప్స్ కూడా రానుందని అంటున్నారు.
ప్రభాస్ - దీపికా పదుకొణె జంటగా నటిస్తున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పఠాని, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇఫ్పటికే వీరిందరికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ రిలీజ్ అయ్యి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. రెండ్రోజుల కిందనే ప్రభాస్ ‘సలార్’ టీజర్ రిలీజై ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలిసిందే. ఈ క్రమంలో ‘ప్రాజెక్ట్ కే’ ఫస్ట్ అప్డేట్ ఎలా ఉండనుందనేది చూడాలి.
What is … The world wants to know!
Come Kloser…
🔗 https://t.co/0rC0ez7Qdf
First drop today at 7:10 PM (IST)/ 6:40 AM (PST). pic.twitter.com/Sd7LOzAOtd