
ఆదిపురుష్ చిత్రం సర్వత్రా విమర్శలు పాలైంది. అసలు ఇది రామాయణమేనా అని పలువురు సందేహాలు వ్యక్తం చేశారు. ప్రధాన పాత్రలు లుక్స్ నుండి, సన్నివేశాల వరకు అనేక అంశాలలో ఆదిపురుష్ విమర్శలు ఎదుర్కొంది. ఆదిపురుష్ చిత్రానికి అసలు సెన్సార్ సెన్సార్ సర్టిఫికెట్ ఎలా జారీ చేశారని న్యాయస్థానాలు సైతం తప్పుబట్టాయి. ఇది మోడరన్ రామాయణ అని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు.
తెలుగులో ఆదిపురుష్ చిత్రాన్ని విడుదల చేసిన వివేక్ కూచిబొట్ల, ఈ తరం ఆడియన్స్, జనరేషన్స్ కి అర్థమయ్యేలా ఆదిపురుష్ తెరకెక్కింది. ఒకప్పటిలా రామాయణం సంస్కృత పద్యాలతో తీస్తే ఎవరూ చూడరు. మీరే అప్డేట్ అవమంటారు. అప్డేట్ అయితే విమర్శలు చేస్తారంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఆయన ఎంతలా సమర్ధించుకున్నా ఆదిపురుష్ మాత్రం తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది.
ఈ క్రమంలో ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతాశిర్ తొలిసారి స్పందించారు. ఆయన సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. ఆదిపురుష్ చిత్రంతో భారతీయుల మనోభావాలు దెబ్బతిన్నాయని నేను అంగీకరిస్తున్నాను. అందుకు నేను క్షమాపణలు తెలియజేస్తున్నాను. భగవాన్ భజరంగి భలి మనలో ఐక్యత పెంపొందించాలి. చెడు నుండి పోరాడే శక్తిని ఇవ్వాలి, అంటూ ట్వీట్ చేశాడు.
జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. ఈ చిత్రానికి మిశ్రమ స్పందన దక్కింది. వరల్డ్ వైడ్ ఈ మూవీ నాలుగు వందల కోట్ల వరకు వసూళ్లు సాధించింది. ప్రభాస్ రాఘవుడు పాత్ర చేశారు. కృతి సనన్ జానకిగా కనిపించారు. ఇక లంకేశ్వరుడు పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు.