
ప్రభాస్ ( Prabhas) హీరోగా రాజమౌళి ( Rajamouli) తెరకెక్కించిన బాహుబలి (Baahubali ) చిత్రం క్రేజ్ ఇన్నాళ్లైనా తగ్గలేదు. అది కూడా ఏ తెలుగు రాష్ట్రాల్లోనో కాదు విదేశాలలో కావటం మరీ గర్వపడే అంశం. ఈ సినిమా కు ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రభాస్, బాహుబలి చిత్రాలకు మంచి క్రేజ్ వచ్చింది. జపాన్‌లో కూడా బాహుబలి ఫ్యాన్ క్లబ్స్ ఏర్పడ్డాయి. ఇందులో నటించిన ప్రభాస్, రానా ( Rana Daggubati )ప్రపంచ వ్యాప్తంగా నీరాజనాలు పట్టారు. తాజాగా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ వార్తల్లో విషయం అయ్యింది.
ప్రస్తుతం స్విజర్లాండ్ న్యూచాటెల్‌లో ‘న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్’ (NIFFF) జరుగుతుంది. ఈ ఫెస్టివల్ కి బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ (Anurag Kashyap) హాజరయ్యాడు. ఇక ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శిస్తున్న సమయంలో ఆడియన్స్ లో కొంతమంది ‘బాహుబలి’ అని అరుస్తున్నారు. మొదటిగా ఒక సినిమా ప్రదర్శించే ముందు యాడ్ ప్లే చేశారు. ఆ సమయంలో ఆడియన్స్ నుంచి బాహుబలి అని అరిచారు. అయితే అది ఒక్కసారితో అయ్యిపోలేదు. రెండు సారి కూడా అదే జరిగింది. అలా మరో మూవీ ప్లే చేసే ముందు యాడ్ వచ్చిన ప్రతి సారి ఆడియన్స్ బాహుబలి అని అరుస్తున్నారు. దీంతో ఆ విషయాన్ని అనురాగ్ కశ్యప్ 4 సార్లు వీడియో తీసి వాటిని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి రాజమౌళి ని ట్యాగ్ చేశాడు.
“రాజమౌళి అండ్ ఆయన సినిమా పై ఇక్కడ చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఆయన గనుక ఒక్కసారి ఇక్కడికి వస్తే అందరూ ఎంతో ఆనంద పడతారు. రాజమౌళి మీరు నిజమైన రాక్ స్టార్” అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ పోస్ట్ కి రాజమౌళి రియాక్ట్ అవుతూ.. అనురాగ్ కశ్యప్ కి థాంక్యూ చెప్పాడు. ఇక ఇన్నాళ్ల తరువాత కూడా బాహుబలి గురించి ఇంటర్నేషనల్ ఆడియన్స్ మాట్లాతుండడంతో ప్రభాస్ అభిమానులు కూడా ఆనందపడుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు అంతటా వైరల్ అవుతున్నాయి.