
రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదలకు సిద్ధమైంది.సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఆ సినిమా కు సంబంధించిన టీజర్. ట్రైలర్, పాటలు ఇప్పటికే రిలీజ్ అయ్యి సినిమాపై ఎక్సపెక్టేషన్స్ పెంచేసాయి. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ అభిమాను లు మాత్రమే కాక సినీ లవర్స్ అంతా ముక్త కంఠంతో ఈ ట్రైలర్ అద్బుతంగా ఉంటుందంటున్నారు. కచ్చితంగా ట్రైలర్ లో విజువల్స్ కళ్లు అలా తెరుచుకుని చూసేలా ఉన్నాయి.
దాంతో ఇప్పుడు ఎక్కడ చూసినా‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో మూవీ ప్రమోషన్‌లు జోరుగా నడుస్తున్నాయి. అదే సమయంలో ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు వస్తుందనే విషయం ఇంట్రస్టింగ్ గా మారింది.
అయితే ఓటీటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు మూవీ మేకర్స్ షాకిచ్చే న్యూస్ చెప్పారు. ఆర్.ఆర్.ఆర్ మూవీ థియేటర్లలో విడుదలైన మూడు నెలల వరకు విడుదల కాదని మూవీ మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా ఆల్ లాంగ్వేజెస్ ఓటీటీ హక్కులను బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. తెలుగు ఓటీటీ హక్కులను జీ5, హిందీ ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సంస్థలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని హిందీలో సమర్పిస్తున్న పెన్ స్టూడియోస్ అధినేత నిర్మాత జయంతిలాల్ కూడా ఓటిటి రిలీజ్ గురించి స్పందించారు. “RRR సినిమా థియేట్రికల్ రిలీజ్ చేసిన 75 నుండి 90 రోజుల తర్వాత ఓటీటీలో ప్రీమియర్ అవుతుంది. ప్రజలు చాలా కాలం పాటు సినిమా హాళ్లలో దీనిని ఎక్స్ పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నారని మేము విశ్వసిస్తున్నాము. అందుకే మేము 30 రోజుల ప్రీమియర్ ని ఎంచుకోలేము” అని జయంతి లాల్ అన్నారు. మొత్తం మీద ఆర్ఆర్ఆర్ మూడు నెలల తర్వాత ఓటిటి లో వస్తుందని తేల్చేసారు.
Also read RRR:ఎన్టీఆర్ లుక్,డైలాగ్స్ పై నార్త్ ఇండియన్స్ షాకింగ్ కామెంట్స్
డిజిటల్ హక్కులను తెలుగు ,తమిళ్ అలాగే కన్నడ తో పాటు మలయాళం భాష కోసం కూడా zee5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు మొదటిసారి దక్షిణ భారత దేశంలో ఇంత పెద్ద సినిమాని కొనుగోలు చేయడం పై Zee 5 కే మాత్రమే సాధ్యమైందనీ దక్షిణ భారతదేశంలో తన సబ్స్క్రైబర్లు పెంచుకోవడం కోసమే ఈ చిత్రంపై తన ఆశలన్నీ పెట్టుకుందట Zee5. జి ఫైవ్ ఉత్తర భారతదేశంలో బాగా విస్తరించిన ఇప్పటికీ దక్షిణాది భారతదేశంలో పెద్దగా సబ్స్క్రైబర్లు పెద్దగా లేరు. అందుకే ఆర్ ఆర్ ఆర్ భారీ విజయాన్ని అందుకుంటే జి ఫైవ్ దక్షిణ భారతదేశంలో సబ్స్క్రైబర్లు లను ఎక్కువ చేరుకోవడంలో సహాయపడుతుందని సమాచారం.
Also readRRR: `ఆర్‌ఆర్‌ఆర్` టీమ్‌కి షాకిచ్చిన అభిమానులు.. మీడియాకి రాజమౌళి క్షమాపణలు..