Vakeel Saab:ట్రెండింగ్ లో ‘వకీల్ సాబ్’,మరో రికార్డ్

Surya Prakash   | Asianet News
Published : Dec 10, 2021, 07:54 AM IST
Vakeel Saab:ట్రెండింగ్ లో ‘వకీల్ సాబ్’,మరో రికార్డ్

సారాంశం

 తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో ‘వకీల్ సాబ్’ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. విజయ్, అజిత్ సినిమాలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోగా పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచాడు. 

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’. హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రావడంతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. సినిమా చాలా బాగుందని టాక్ వచ్చింది. అయితే కరోనా వలన ఈ చిత్రాన్ని ఎక్కువ రోజులు థియేటర్ లో ప్రదర్శించలేకపోయారు దర్శకనిర్మాతలు. ఆ తర్వాత ఈ మూవీ   ‘జీ తెలుగు’లో ఈ చిత్రం టెలికాస్ట్‌ అయ్యి అక్కడా రికార్డ్ స్దాయి టీఆర్పీ సొంతం చేసుకుంది.   అలాగే ఇప్పుడు మరో రికార్డ్ ని సొంతం చేసుకుంది.

 తాజాగా ట్విట్టర్ లో ఈ ఏడాది టాప్ 5 మోస్ట్ ట్వీటెడ్ మూవీస్ లిస్ట్ బయటకు వచ్చింది. ఈ జాబితాలో ‘వకీల్ సాబ్’ కూడా స్థానం దక్కించుకోవడం విశేషం. విజయ్, అజిత్ సినిమాలు మొదటి రెండు స్థానాలను ఆక్రమించుకోగా పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో నిలిచాడు. మరో విషయం ఏమిటంటే టాలీవుడ్ నుంచి టాప్ 5 లో ఉన్నది ‘వకీల్ సాబ్’ మాత్రమే. ఈ లిస్ట్ మొత్తాన్ని తమిళ సినిమాలే ఆక్రమించుకోవడం గమనార్హం.

2021లో భారతదేశంలో అత్యధికంగా ట్వీట్ చేసిన చిత్రాలలో విజయ్ ‘మాస్టర్’ మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో మరో కోలీవుడ్ స్టార్ అజిత్ నెక్స్ట్ మూవీ ‘వాలిమై’ ఉంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకపోయినప్పటికీ కేవలం ప్రోమో, మేకింగ్ తోనే ఈ రికార్డును క్రియేట్ చేసింది. విజయ్ ‘బీస్ట్’ కూడా చిత్రీకరణ దశలో ఉన్నప్పటికీ ఈ జాబితాలో మూడవ స్థానంలో నిలిచింది. 

ఇక సూర్య ‘జై భీమ్’ ఈ లిస్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ 4వ స్థానంలో ఉంది. ఇక చివరగా అంటే 5వ స్థానంలో ‘వకీల్ సాబ్’ నిలిచింది. పవన్ మూవీ ఈ సంవత్సరంలో అత్యధికంగా ట్వీట్ చేసిన చలనచిత్రాలలో ఒకటిగా నిలిచింది.

Also read త్రివిక్రమ్ నన్నెప్పుడూ అలాగే చూస్తారు.. అవకాశాల కోసం అడుక్కోను, నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ సరసన శృతిహాసన్ హారోయిన్ గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో అనన్య,అంజలి, నివేదా థామస్, ప్రకాష్ రాజ్‌లు కనిపించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలోనే కాకుండా అమెజాన్‌ ప్రైమ్‌ ఓటీటీలో విడుదలై అక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. చూడాలి భవిష్యత్ లో.. ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో.

Also read Gamanam Review: శ్రియా `గమనం` మూవీ రివ్యూ
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

60 ఏళ్ల వయసులో సిక్స్ ప్యాక్, కుర్ర హీరోలను భయపెడుతున్న స్టార్ హీరో, ఫిట్ నెస్ సీక్రేట్ ఏంటో తెలుసా?
మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ కి విజయ్ దేవరకొండ స్పెషల్ గిఫ్ట్, ఏంటంటే?