Bigg Boss Telugu 7 : పల్లవి ప్రశాంత్ తో అర్జున్, ప్రియాంక ఘర్షణ.. బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేసిన రైతు బిడ్డ

Published : Dec 06, 2023, 11:35 PM ISTUpdated : Dec 06, 2023, 11:36 PM IST
Bigg Boss Telugu 7 :   పల్లవి ప్రశాంత్ తో అర్జున్, ప్రియాంక ఘర్షణ.. బిగ్ బాస్ కు రిక్వెస్ట్ చేసిన రైతు బిడ్డ

సారాంశం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7  చివరి దశకు చేరుకుంది. దీంతో పోటీదారుల మధ్య ఆసక్తికరమైన ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా పల్లవి ప్రశాంత్ తో అర్జున్ అంబటి, ప్రియాంక కు మధ్య వాగ్వాదం జరిగింది.

Bigg Boss Telugu 7  ముగింపు దశకు చేరుకుంది. చివరిగా గౌతమ్ కృష్ణ హౌజ్ ను వీడిపోవడంతో  ప్రస్తుతం హౌజ్ లో ఏడుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అర్జున్ అంబటి, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, యావర్, శోభాశెట్టి, అమర్ దీప్, శివాజీ మధ్య గట్టి పోటీ నెలకొంది. స్పా, స్పై బ్యాచ్ లుగా కొనసాగుతున్నారు. వీరి నుంచి నెక్ట్స్ ఇద్దరు హౌజ్ నుంచి వెళ్లి పోవాల్సి ఉంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ ఆస్తికరమైన గేమ్స్ ను ఆడిస్తున్నారు.

ఇప్పటికే అమర్ దీప్ హౌజ్ లో అందరినీ దాటేసి ముందువరసలో ఉన్నారు. ఈవారం కెప్టెన్సీని కూడా దక్కించుకున్నారు. మరోవైపు ఓటు అపియల్ కు కూడా ఈ వీక్ కు మొదటి కంటెండర్ గా ఎన్నికయ్యారు. ఇక ఈరోజు బిగ్ మరిన్ని గేమ్స్ ను ఆడించారు. సాండ్ ఐస్, రన్నింగ్ వంటి పోటీలను నిర్వహించారు. అంతా బాగానే జరిగినా చివరి ఆటలో పల్లవి ప్రశాంత్ అర్జున్ మధ్య వాగ్వాదం ఏర్పడింది.

తనను అర్జున్ కావాలనే పరిగెత్తకుండా ఆపేశాడని ప్రశాంత్ ఆరోపించారు. అదేం లేదు నా రన్నింగ్ స్టైల్ అలాగే ఉంటుంది. నేను నిన్ను  కావాలని ఆపిందేమీ లేదంటూ వివరణ ఇచ్చారు. అర్జున్ చెప్పినదానికి ప్రియాంక కూడా  మద్దతు ఇచ్చింది. ఇద్దరు కలిసి ప్రశాంత్ ను తప్పుబట్టారు. ఇక యావర్ కూడా ప్రశాంత్ దే తప్పు అన్నట్టుగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

దీంతో పల్లవి ప్రశాంత్ నిన్నటి గేమ్స్ లో తనను అర్జున్ కావాలనే పట్టుకున్నాడని, అందుకే ఈరోజుటి ఆటలో తనను అడ్డుకునే ప్రయత్నం చేసినందుకు అర్జున్ ను పట్టుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఈ మేరకు నిన్నటి గేమ్ వీడియో కావాలంటూ బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశారు. ఇక గేమ్ లో అర్జున్ అంబటి విజయం సాధించారు. 

అమర్ దీప్ చివరిగా అర్జున్ ను విజేతగా ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ఆయనను కంన్ఫెషన్ రూమ్ కు పిలిచారు. ఉల్లిగడ్డలు తీనాలనే చిన్న టాస్క్ ఇచ్చి ఓటు అపీయల్ కు సెకండ్ కంటెండర్ గా ప్రమోట్ చేశారు. మొత్తానికి ప్రశాంత్ పైనే ఈరోజు ఎపిసోడ్ సాగిందని చెప్పొచ్చు. మరో వారం ముగియనున్న బిగ్ బాస్ నుంచి ఫైనల్ కు వెళ్లేదెవరు? టైటిల్ కొట్టెదెవరనేది రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. 

PREV
click me!

Recommended Stories

Rajinikanth : 75 ఏళ్ల వయసులో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న రారాజు
Illu Illalu Pillalu Today Episode Dec 12: రాత్రయినా ఇంటికి రాని వల్లీ భర్త , వేదవతిని రెచ్చగొట్టిన నర్మద