ఏఎంబీ మాల్ లో పవన్ కళ్యాణ్ కూతురు.. ఇప్పుడెలా ఉందో చూశారా? సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఆరాటం..

Published : Dec 06, 2023, 10:05 PM IST
ఏఎంబీ మాల్ లో పవన్ కళ్యాణ్ కూతురు.. ఇప్పుడెలా ఉందో చూశారా? సెల్ఫీల కోసం ఫ్యాన్స్ ఆరాటం..

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - రేణు దేశాయిల కూతురు ఆద్య తాజాగా పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది. తల్లితో పాటు బయటికి వచ్చిన స్టార్ కిడ్ తో సెల్పీల కోసం అభిమానులు ప్రయత్నించారు. సంబంధిత వీడియో వైరల్ గా మారింది. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan kalyan) - రేణు దేశాయి 2012లో విడిపోయిన విషయం తెలిసిందే. అప్పటికే వీరిద్దరికి అకీరా, ఆద్య జన్మించారు. పవన్ కళ్యాణ్ కూతురు, కొడుకు చాలా అరుదుగా పబ్లిక్ అపియరెన్స్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే అకీరా హీరోగా మొదటి సినిమా  కోసం పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్- రేణు దేశాయి (Renu Desai)ల కూతురు ఆద్య తాజాగా పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చింది. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంది. ఇవ్వాళ తల్లి రేణు దేశాయితో కలిసి హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ కు వచ్చారు. మూవీ చూసేందుకు వచ్చిన తల్లికూతురు ఆడియెన్స్ ను చూపుతిప్పుకోకుండా చేశారు. ముఖ్యంగా ఆద్యను చూసిన పవన్ అభిమానులు సెల్ఫీల కోసం ప్రయత్నించారు. 

కానీ ఆద్య బయడి సెల్ఫీలకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం నెట్టింట ఆద్య చిన్నప్పటి క్యూట్ ఫొటోలు మాత్రమే అభిమానులకు అందుబాటులో ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బాగా మారిపోయిన స్టార్ కిడ్ ను చూసి అభిమానులు ఖుషీ అవుతున్నారు. పవన్ డాటర్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు. 

ఇక రేణు దేశాయి 20 ఏళ్ల తర్వాత వెండితెరకు రీఎంట్రీ ఇచ్చింది. రీసెంట్ గా మాస్ మహారాజా రవితేజ నటించిన ‘టైగర్ నాగేశ్వర రావు’ చిత్రంలో కీలకపాత్రలో మెరిసింది. సంఘసంస్కర్త హేమలత లవణంగా అలరించింది. నెక్ట్స్ ఎలాంటి సినిమాతో రాబోతుందనేది ఆసక్తికరంగా మారింది.  మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటు పొలిటికల్ ప్రొగ్రామ్స్, అటు భారీ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నెక్ట్స్ OG తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌