Abhiram Wedding : శ్రీలంకలో గ్రాండ్ గా రానా తమ్ముడు అభిరామ్ పెళ్లి.. వైరల్ గా పెళ్లిపత్రిక

By Asianet NewsFirst Published Dec 6, 2023, 10:34 PM IST
Highlights

ప్రముఖ నిర్మాత కొడుకు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లిపీటలు ఎక్కారు. ఈరోజే వధువు మెడలో తాళికట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

దగ్గుబాటి వారి ఇంట్లో కొద్దికాలంగా పెళ్లిబజాలు మోగుతున్నాయి. ఆ మధ్యలో వెంకీ చిన్న కూతురు నిశ్చితార్థం ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక తాజాగా స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు చిన్న కొడుకు, రానా దగ్గుబాటి (Rana Daggubati)  తమ్ముడు అభిరాం (Abhiram) పెళ్లి పీటలు ఎక్కారు. కొద్దిరోజులుగా అభిరామ్ పెళ్లికి సంబంధించిన న్యూస్ నెట్టింట వైరల్ గా హల్ చల్ చేస్తోంది. 

తాజాగా అభిరామ్ పెళ్లి పూర్తైంది. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్ శ్రీలంకలో అభిరామ్ పెళ్లి గ్రాండ్ గా జరిగింది. ఈరోజు రాత్రి 8:50 నిమిషాలకు వధువు మెడలో తాళి కట్టారు. ఇప్పటికే దగ్గుబాటి ఫ్యామిలీ సభ్యులు, వెంకీ ఫ్యామిలీ, పలువురు ప్రముఖులు, సెలబ్రెటీలు ఈ వివాహానికి హాజరయ్యారు. నూతన జంటను ఆశీర్వదించారు. 

Latest Videos

ఇక పెళ్లికి సంబంధించిన ఫొటోలు రావాల్సి ఉంది. ప్రస్తుతానికి పెళ్లి పత్రిక మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. తాత రామానాయుడు, నాన్నమ్మ పేర్లతో రిచ్ గా ముద్రించారు. పెళ్లి కార్యక్రమం ముగియడంతో నెక్ట్స్ రిసెప్షన్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లును కూడా  పూర్తి చేస్తున్నారు. పెళ్లికి 200 మంది హాజరైనట్టు తెలుస్తోంది.  

 

click me!