బిగ్ బాస్ హౌజ్ లోకి దీక్షా పంత్

Published : Jul 30, 2017, 07:28 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
బిగ్ బాస్ హౌజ్ లోకి దీక్షా పంత్

సారాంశం

బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీపై దీక్షా పంత్ అనసూయ సహా చాలా మందిని ట్రై చేసిన స్టార్ మా చివరకు దీక్షా పంత్ ను ఎంపిక చేసిన బిగ్ బాస్

తెలుగు బిగ్ బాస్ లాంచ్ చేసినప్పటి నుంచి కంటెస్టెంట్స్ విషయంలో కాస్త అసంతృప్తితో వున్నా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాక తెలుగు బుల్లి తెర అభిమానులంతా.. యంగ్ టైగర్ హోస్టింగ్ తో యమా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పటికే పార్టిసిపెంట్స్ లో జ్యోతి, మధుప్రియ, సంపూ షో నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా షోకు మరింత గ్లామర్ యాడ్ చేసే ఆలోచనతో ఒక అప్ కమింగ్ హీరోయిన్ ను ఓకే చేశారు.

ఆ పార్టిసిపెంట్ మరెవరో కాదు.. గోపాల గోపాల సినిమాలో గోపికా మాతగా నటించింది. ఒక లైలా కోసం సినిమాలో నటించిన దీక్షా పంత్. బంతి పూల జానకి సినిమాలో ధనరాజ్ తో కలిసి హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఫ్లుయెంట్ గా మాట్లాడగలిగే దీక్ష ఎంట్రీతో బిగ్ బాస్ షోలో సరికొత్త బంధాలు అనుబంధాలు ఏర్పడనున్నాయి. ఇప్పటికే తెలుగులో ఒకటి నుంచి ఇరవై వరకు తప్పు లేకుండా చెప్పి ఎట్రాక్ట్ చేసిన గ్లామర్ డాల్.. ఎంట్రీ స్విమింగ్ పూల్ లో ఇచ్చి షోకు గ్లామర్ బాగా యాడ్ చేసింది.

PREV
click me!

Recommended Stories

Eesha Rebba: తరుణ్‌ భాస్కర్‌ చెంప చెల్లుమనిపించిన ఈషా.. మార్షల్‌ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ప్రతీకారం
Padma Awardsపై మురళీ మోహన్‌, రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్‌ కామెంట్‌.. చిరంజీవి సత్కారం