తిరిగి బిగ్ బాస్ హౌజ్ లో ముమైత్ ఖాన్..అర్థరాత్రి లైట్స్ ఆన్

First Published Jul 29, 2017, 10:08 PM IST
Highlights
  • తిరిగి బిగ్ బాస్ హౌజ్ లో ముమైత్ ఖాన్..
  • బిగ్ బాస్ హౌజ్ చేరుకోగానే అర్థరాత్రి లైట్స్ ఆన్ చేసిన ముమైత్
  • ముమైత్ రావటంతో పార్టిసిపెంట్స్ సంబరాలు, సందడి

బిగ్‌బాస్ తెలుగు వెర్షన్ కార్యక్రమంలో శుక్రవారం నాటి ఎపిసోడ్‌లో అనూహ్యమైన పరిణామాలు చోటుచేసుకొన్నాయి. బిగ్‌బాస్‌ నుంచి బయటకు వచ్చిన ముమైత్ ఖాన్ మళ్లీ ఇంటి సభ్యులతో జాయిన్ అయ్యింది. ఇక బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో కల్పన ఓడిపోవడంతో ప్రిన్స్ కొత్త కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక కల్పనకు వ్యతిరేకంగా ఇంటి సభ్యులు మాట్లాడుకోవడం, ఆమెకు వ్యతిరేకంగా ఓ బలమైన గ్రూప్ ఏర్పాటైనట్టు స్పష్టమవుతున్నది. కాగా ముమైత్ బిగ్‌బాస్ హౌస్‌లోకి చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య ఆనందం వెల్లువెత్తింది.

కెప్టెన్ ఎంపిక కోసం బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. గుర్రపు బొమ్మలపై ఊగుతూ ఎక్కువ సేపు ఎవరు ఉంటారో వారి కెప్టెన్‌ అవుతారని చెప్పారు. ఆ టాస్క్‌ లో కొంత సేపటి తర్వాత కల్పన కూప్పకూలింది. మధ్యలోనే శివబాలాజీ డ్రాప్ అయ్యాడు. దాంతో ప్రిన్స్‌ కు కొత్త కెప్టెన్‌  అవకాశం వచ్చింది.

మరోవైపు కల్పన తీరుపై కత్తి కార్తీక, మధుప్రియ మనస్తాపానికి గురయ్యారు. తాము ఆమెకు ఎంతో క్లోజ్ గా ఉంటుంటే తమతో అలా వ్యవహరిస్తారా అనే చర్చించుకోవడం కనిపించింది. ఇక కల్పనకు కెప్టెన్ పదవిపై చాలా మోజు ఉంది. లేకపోతే ఆమె అలా వ్యవహరించదు. కెప్టెన్ పదవి వచ్చిన తర్వాత ఆమె బాడీ ల్వాంగ్వేజ్ మారిపోయింది. వామ్మో ఆమెను చూస్తుంటే చాలా భయమేస్తుంది అని అర్చన, సమీర్ కూడా గుసగుసలాడుకోవడం గమనార్హం. అలా కలహాలు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం లాంటి ఘటనలతో శుక్రవారం ఎపిసోడ్ సాగింది.

అర్థరాత్రి సమయంలో ఇంటి సభ్యులు నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఇంటిలో లైట్లు వెలిగాయి. ముమైత్ మాటలు వినిపించడంతో ఇంటి సభ్యుల ముఖంలో ఆనందం వెల్లువెత్తింది. చాలా సేపు తనదైన శైలిలో, మాటలతో బిగ్‌బాస్ ఇంటిలో ముమైత్ అలజడి సృష్టించింది. చివరకి ముమైత్ ఇంటిలోకి రావడంతో ఇంటి సభ్యుల ముఖాలు వెలిగిపోయాయి. ముమైత్‌ను అందరూ కౌగిలించుకొని లోనికి ఆహ్వానించారు. అందరూ కౌగిలింతలతో ముమైత్‌ను ముంచెత్తారు. ధన్‌రాజ్, ముమైత్ మధ్య అనుబంధం మరోసారి ఆకర్షణగా నిలిచింది.

ఇక వైల్డ్ కార్డు ఎంట్రీతో బిగ్‌బాస్‌లోకి మరో తార వస్తున్నదంటూ వార్తలు ప్రచారం జరుగుతున్నాయి. యాంకర్లు అనసూయ, రష్మీ‌లను సంప్రదిస్తున్నా.. వాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపించట్లేదు. అయితే షట్లర్ గుత్తా జ్వాలాను కూడా సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ గుత్తా జ్వాలా ప్రొఫైల్ కు సరిపడేలా కంటెస్టెంట్స్ లేరని ఆమె చెప్పినట్లు సమాచారం. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మంచు లక్ష్మీ వస్తుందా లేక తను కూడా మనసు మార్చుకుందా అనేది ప్రస్థుతానికి సస్పెన్స్. మొత్తంమీద ముమైత్ అయితే తిరిగి బిగ్ బాస్ గూటికి చేరింది.

click me!