బిగ్ బాస్ సీజన్ 2 కూడా ఎన్టీఆర్ తోనే.. హౌజ్ లో విజయ్ దేవరకొండ

Published : Aug 24, 2017, 07:53 PM ISTUpdated : Mar 25, 2018, 11:45 PM IST
బిగ్ బాస్ సీజన్ 2 కూడా ఎన్టీఆర్ తోనే.. హౌజ్ లో విజయ్ దేవరకొండ

సారాంశం

బిగ్ బాస్ హోస్ట్ గా ఫుల్ సక్సెస్ అయిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ తోనే బిగ్ బాస్ సీజన్ 2 నిర్వహించాలని స్టార్ మా యోచన రేటింగ్స్ సత్తాతో సినిమా ప్రమోషన్స్ కు వేదికగా మారిన బిగ్ బాస్ హౌజ్

తెలుగులో బిగ్ బాస్ షో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్‌ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ షో కు రోజు రోజుకు ప్రేక్షకాదరణ పెరుగుతూ వస్తుంది. ఇక ఎన్టీఆర్ కనిపించే శని,ఆది వారాల్లో అయితే అత్యధిక టిఆర్పీ రేటింగ్ లు సాధిస్తుంది. ఇక ఈ షో కి మరింత గ్లామర్ తెచ్చేందుకు యాజమాన్యం బాలీవుడ్ తరహాలో ఆలోచిస్తుంది. సినిమా రిలీజ్ టైంలో తమ సినిమాలను ప్రమోట్ చేసుకునేందుకు ఈషోను వాడుకుంటున్నారు.

 

మొదట ఈ షోపై ప్రేక్షకులు అంతలా ఆసక్తి కనబర్చలేదు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌‌లో ఒకరిద్దరిని మినహాయిస్తే మిగిలినవారు పెద్ద సెలబ్రెటీ హోదా వున్నవాళ్లు కాకపోవడమే ఇందుకు కారణం. అయితే రానురాను ప్రేక్షకులను జూనియర్ ఎన్టీఆర్ తన మేనరిజంతో ఆకట్టుకున్నాడు. టీఆర్పీ రేటింగ్ ఊహించని రీతిలో పెరిగింది. తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించి.. ప్రేక్షకులను అలరించాడు. దీంతో టీఆర్పీ రేటింగ్ ఊహించని రీతిలో పెరిగింది. బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌లో మార్పులుచేర్పులు చేయడం, ఉన్న వారి తీరులో మార్పు రావడం కూడా షోకు బాగా కలిసొచ్చింది.

 

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించడం స్టార్ మాకు కలిసి రావడంతో సెకండ్ సీజన్‌కు కూడా జూనియర్ ఎన్టీఆర్‌నే హోస్ట్‌గా తీసుకోవాలని యాజమాన్యం నిర్ణయించిందట. ఇప్పటికే ఈ విషయంపై చానల్ యాజమాన్యం ఎన్టీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. సెకండ్ సీజన్ సెకండ్ సీజన్ చేసేందుకు ఎన్టీఆర్ కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తోంది. మీలో ఎవరు కోటీశ్వరుడు సెకండ్ సీజన్ విషయంలో నాగార్జునకు బదులుగా చిరంజీవిని హోస్ట్‌గా పెట్టారు. కానీ బిగ్ బాస్ విషయంలో అలాంటి ప్రయోగం చేయకుండా చానల్ యాజమాన్యం ఎన్టీఆర్ నే ఎంచుకోవడంతో జూనియర్ ఫ్యాన్స్ మరింత గర్వంగా ఫీలవుతున్నారు.

 

ఇక బిగ్ బాస్ షో ద్వారా సినిమా ప్రమోషన్లు కూడా జోరందుకున్నాయి. ఈ మధ్యన విడుదలైన రానా.. నేనే రాజు.. నేనే మంత్రి మూవీ ప్రమోషన్ కు హీరో రానా దగ్గుబాటి పంచకట్టుతో బిగ్ బాస్ హౌజ్ కు వెళ్లారు. ఆ తర్వాత ఆనందోబ్రహ్మ మూవీ ప్రమోషన్లో భాగంగా నటి తాప్సీ కూడా బిగ్ బాస్ ఇంటికి వెళ్లొచ్చింది. తాజాగా ఆ ఛాన్స్ అర్జున్ రెడ్డి చిత్ర హీరో విజయ్ దేవరకొండ బిగ్ బాస్ హౌస్ లో దర్శనం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

 

ఇప్పటికే ఈ చిత్రం పలు రకాలుగా వివాదాస్పదమై.. మీడియాలో వార్తల రూపంలో పదే పదే రావటంతో పాటు ఈ మూవీపై ఇప్పటికే కొంత ఆసక్తిని క్రియేట్ చేయగలిగారు. బిగ్ బాస్ షోలో కనిపించటం ద్వారా సినిమాను మరింత పాపులర్ చేయాలన్న ఆలోచనలో ఉన్న అర్జున్ రెడ్డి చిత్ర టీం.. తమ హీరోను బిగ్ బాస్ ఇంటికి పంపుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అర్జున్ రెడ్డి బిగ్ బాస్ ఇంట్లో సందడి చేసేందుకు ఫుణే వెళ్లినట్లుగా సమాచారం.

PREV
click me!

Recommended Stories

Bharani Elimination: ఫలించని నాగబాబు ప్రయత్నం, భరణి ఎలిమినేట్‌.. గ్రాండ్‌ ఫినాలేకి చేరింది వీరే
Suman Shetty Remuneration: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రైజ్‌ మనీని మించి పారితోషికం.. సుమన్‌ శెట్టికి దక్కింది ఎంతంటే?